Gurudwara shooters mother apologises to families of victims

Gurudwara shooter's mother apologises to families of victims,Jesse Alvin Page, Wade Michael Page, Wisconsin shooting, gurdwara shooting

Gurudwara shooter's mother apologises to families of victims

Gurudwara.gif

Posted: 08/08/2012 02:41 PM IST
Gurudwara shooters mother apologises to families of victims

Gurudwara shooter's mother apologises to families of victims

కొడుకు చేసిన తప్పులను  సమర్థించే తల్లులు ఉన్న విషయం తెలిసిందే.  అయితే తన కొడుకు  చేసిన ఘోరమైన తప్పు కు అతని బాధితుల ముందు తల వంచి  క్షమాపణలు కోరింది.  అమెరికాలోని విస్కాన్సిస్ గురుద్వారాలో కాల్పులు జరిగినప్పుడు అరవై అయిదేళ్ల గురుద్వారా అధిపతి సాద్వంత్ సింగ్ కలేకా వీరోచితంగా ఎదురొడ్డి పలువురు మహిళలు, పిల్లల ప్రాణాలు కాపాడారు. అందుకోసం ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టారు. అమెరికా మాజీ సైనికుడు, అయిన మైఖేల్ పేజ్‌ను కలేకా అడ్డుకునే సరికి అతను పార్కింగ్‌లో ఒకరిని కాల్చి చంపాడు. కలేకా తన వద్ద ఉన్న సిక్కులు సాంప్రదాయంగా ధరించే కృపాణ్(కత్తి)తో ఫేజ్‌తో తలపడ్డాడు. అయితే ఫేజ్ తన వద్ద ఉన్న తుపాకితో కలేకాను కాల్చి చంపాడు. తన ఆయుధం, బలం సరిపోవని తెలిసినప్పటికీ పేజ్‌ను నిలువరించడానికి కలేకా చేసిన కొద్ది క్షణాల ప్రయత్నం వల్ల మహిళలు, పిల్లలు కాల్పుల నుండి తప్పించుకోవడానికి వీలయింది. ఆ కాస్త సమయంలో పలువురు ఆ ఆవరణలో ఉన్న గదుల్లోకి వెళ్లి తలుపులు బిగించేసుకొని దాక్కున్నారు.

 1982లో అమెరికా వచ్చిన కలేకా వ్యాపారవేత్తగా విజయం సాధించారు. ఆయన సంపాదన అంతా గురుద్వారా నిర్మాణానికే ఉపయోగించారు. గురుద్వారాలో ఆరుగురిని కాల్చి చంపిన పేజ్‌కు శ్వేతజాత్యాహంకార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో ఎఫ్‌బిఐ దర్యాఫ్తు చేస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కి ఫోన్ చేశారు. ప్రార్థనాలయాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని హిల్లరీని కృష్ణ కోరారు. ఆమె సానుకూలంగా స్పందించారు. గురుద్వారాలో హత్యోదంతంతో కలత చెందానని అధ్యక్షుడు ఒబామా అన్నారు. మరోవైపు ఆరుగురు సిక్కులను హతమార్చడంపై హంతకుడు పేజ్ తల్లి లారా లిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చశారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు. పేజ్ చిన్నప్పుడు ఎంతో మంచిగా మెదిలేవడాని, ఆప్తులను కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నానన్నారు. జరిగిన ఘటనకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. 12 ఏళ్లుగా పేజ్‌తో సంబంధాలు లేవని, తన కుమారుడి మరణ వార్త విని తన హృదయం ముక్కలైందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia offers rs 57 lakh reward for fugitive panchkula driver
450 members indian peoples muscat police jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles