Australia offers rs 57 lakh reward for fugitive panchkula driver

Australia offers Rs 57 lakh reward for fugitive Panchkula driver,Australia, Australia offers reward for fugitive Indian, Indians in Australia

Australia offers Rs 57 lakh reward for fugitive Panchkula driver

Australia.gif

Posted: 08/08/2012 02:45 PM IST
Australia offers rs 57 lakh reward for fugitive panchkula driver

Australia offers Rs 57 lakh reward for fugitive Panchkula driver

మన భారతీయుడి విలువు  ఎంతో తెలుసా?  అక్షరాల  57 లక్షలు .  మన భారతీయుడిని  పట్టిస్తే ..  57 లక్షలు ఇస్తామాని  మొదటి సారి ఒక దేశం ప్రకటన చేసింది.  మన భారతీయుడి పై ఆ దేశం ఎందుకు  రివార్డ్ ప్రకటించిందంటే .. 2008, అక్టోబర్‌లో ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడైన భారతీయ డ్రైవర్ ఆచూకీ తెలిపితే రూ.57 లక్షల రివార్డ్ అందిస్తామని ఆస్ట్రేలియా ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దేశ చరిత్రలో ఇలాంటి ప్రకటన ఇదే మొదటిది కావడం విశేషం. వివరాలు.. భారత దేశానికి చెందిన పునీత్(19) 2008, అక్టోబర్‌లో సౌత్‌బ్యాంక్‌లోని నగర రోడ్డుపై కారు నడపడం నేర్చుకుంటున్నాడు. ఆ సమయంలో అదుపుతప్పి క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఇద్దరు పాదచారులు డీన్ హాఫ్‌స్టీ(19), క్లాన్సీ క్లోకర్‌లను కారుతో ఢీకొన్నాడు. ఈ ఘటనలో డీన్ హాఫ్‌స్టీ అక్కడికక్కడే మృతి చెందగా, క్లోకర్ తీవ్రంగా గాయపడ్డాడు.

దీనిపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, పునీత్‌ను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం, బెయిల్‌పై విడుదలైన పునీత్, 2009 ఆగస్టు నాటి కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ఏడాది జూన్ 12నే పునీత్ తన స్నేహితుని పాస్‌పోర్టు సాయంతో దేశం విడిచి వెళ్ళిపోయాడని గుర్తించారు.కాగా, పునీత్‌కి పాస్‌పోర్టు ఇచ్చిన అతని స్నేహితుడికి కోర్టు రెండున్నర సంవత్సరాల కారాగారం విధించింది. మరోపక్క పునీత్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడపట్టినా ఫలితం కనిపించలేదు. దీంతో రివార్డు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పునీత్ ఆచూకీ వెల్లడవుతుందనే నమ్మకం ఉందని పోలీస్ సహాయ కమిషనర్ రాబర్ట్ హిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి పీటర్ వార్ఘీస్ రివార్డ్ ప్రకటనను స్వాగతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Meet stevie wonder the blind piano playing cat who loves to entertain himself by tinkling the ebony and ivories
Gurudwara shooters mother apologises to families of victims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles