15 crore people suffer with diabetes in ap

1.5 crore people suffer with diabetes in ap.png

Posted: 07/23/2012 03:58 PM IST
15 crore people suffer with diabetes in ap

diabeticsరాష్ట్రంలో మధుమేహం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతి పది మందిలో ముగ్గురు డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నట్టు హైదరాబాద్‌లోని నిమ్స్ కేంద్రంగా పనిచేస్తోన్న మధుమేహ పరిశోధనా సంస్థ (డీఆర్‌ఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటిన్నర మంది పైనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండవచ్చని నివేదిక తెలిపింది. 2002 నివేదిక ప్రకారం రాష్ట్రంలో 16 శాతం మందికి మధుమేహం ఉండగా.. ఇప్పుడు ఇది రెండింతలై 32 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా పాతికేళ్ల వయసు దాటినవారికి వచ్చే టైప్ 2 డయాబెటిక్ వేగంగా విస్తరిస్తోంది. టైప్ 2తో పోల్చుకుంటే 15 ఏళ్లలోపు ఉండేవారికి వచ్చే టైప్ 1 డయాబెటిక్ వ్యాధి తక్కువగానే ఉంది. నగరాల్లో టైప్ 2 డయాబెటిక్‌తో బాధపడేవారు సుమారు 21 శాతం ఉంటే.. పల్లెల్లో 7 శాతం మందికి ఉన్నట్టు తేలింది. గతంలో ఇది పల్లెటూళ్లలో 1 లేదా 2 శాతం మాత్రమే ఉండేది. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచవ్యాప్తంగా 70 నగరాలను డయాబెటిక్ కేంద్రాలుగా గుర్తిస్తే.. అందులో అత్యధిక శాతం డయాబెటిక్ రోగులున్న నగరంగా హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. నగరంలో ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నట్టు స్పష్టమైంది.

కొత్త రకాల జబ్బులూ కారణమే, ఇన్నాళ్లూ మానసిక ఒత్తిళ్లు, భోజనంలో ఎక్కువగా వరి అన్నం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం తదితర ప్రధాన కారణాలనే డయాబెటిక్ జబ్బుకు కారణంగా వైద్యులు చెబుతుండేవారు. కానీ ఇప్పుడు డీఆర్‌ఐ మరికొన్ని కఠోర వాస్తవాలు వెల్లడించింది. రాష్ట్రంలో అనేక కొత్త జబ్బులు రావడం కూడా షుగర్‌కు కారణమవుతోందని తెలిపింది. దీనికితోడు కాలుష్యం కూడా ప్రధాన కారణంగా పనిచేస్తోందని పేర్కొంది. హైదరాబాద్‌లాంటి ప్రధాన నగరాల్లో రోజుకో కొత్త రకం జ్వరాలు సోకుతున్నాయ ని, దీంతో శరీరంలో వ్యాధినిరోధక శక్తి కోల్పోతుండటం కారణంగా కూడా మధుమేహం వస్తోందని తెలిపింది. దేహంలో సీసం, మెర్క్యురీ, లెడ్, నికెల్ తదితర లోహాల మోతాదు ఎక్కువగా ఉండటం ప్రమాదంగా మారుతోందని వెల్లడించింది. వ్యాధి నిరోధక శక్తి కణాలకు వ్యతిరేకంగా శరీరంలో కొత్త కణాలు పుట్టుకొచ్చి నిర్వీర్యం చేస్తున్నట్టు పరిశోధనల్లో స్పష్టమైంది. టైప్ 2 డయాబెటిక్‌తో బాధపడుతున్నవారిలో ఎక్కువగా గుండెజబ్బులు, కిడ్నీ జబ్బులు, కంటి, పంటి జబ్బులు వస్తుండగా... టైప్ 1 బాధితులకు టీబీ సోకుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thief enters amitabh bachchan bungalow
Gati joins hands with pista house for supply of fresh hyderabadi haleem  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles