Rising visa costs may pinch it firms profits

Rising visa costs may pinch IT firms’ profits,Visa, US, IT, Earnings, Software, Nasscom, Corporate News, Sector Spotlight

Rising visa costs may pinch IT firms’ profits

visa.gif

Posted: 07/16/2012 12:42 PM IST
Rising visa costs may pinch it firms profits

Rising visa costs may pinch IT firms’ profits

వీసాల ఫీజులు పెంచడంతో ఇప్పటికే కంపెనీ మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఇదే పరిస్థితి రానున్న కాలంలో కూడా కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  అమెరికా వీసాలు పొందడం భారత ఐటి కంపెనీలకు తలకు మించిన భారంగా మారుతోంది. వీసా రుసుమును పెంచడంతోపాటు వీసా నిబంధనలను కఠిన తరం చేయడం వల్ల ఐటి కంపెనీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. భారత ఐటి రంగానికి అమెరికా మార్కెట్ నుంచి 60 శాతం రాబడి వస్తోంది. అందుకే ఈ మార్కెట్ మన దేశ కంపెనీలకు చాలా కీలకం. కంపెనీలు నియమించుకున్న ఉద్యోగులను అమెరికాకు పంపేందుకు భారీ స్థాయిలో వీసాలకు దరఖాస్తు చేస్తున్నాయి. వీటి ఫీజు పెరగడం ఇప్పుడు కంపెనీల పాలిట శాపంగా మారుతోంది. అంతేకాకుండా వీసా నిబంధనల్లో మార్పుల కారణంగా చాలా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఫలితంగా కంపెనీలు వెచ్చించే వ్యయం అధికం అవుతోంది. అయినా కంపెనీలు తమ వ్యాపారాన్ని నిరాటకంగా కొనసాగించే నిమిత్తం వీసాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఈ ఏడాదిలో 5,900 హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసింది.

Rising visa costs may pinch IT firms’ profits

గత ఏడాదిలో ఈ కంపెనీ 4,500 వీసాలకు దరఖాస్తులు సమర్పించింది. ఎల్1 కేటగిరీ వీసాలు అధికంగా తిరస్కరణకు గురవుతున్న కారణంగా ఈ సారి హెచ్1బి వీసాలకు ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు టిసిఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హ్యూమన్ రీసోర్స్ హెడ్ అజయ్ ముఖర్జీ చెబుతున్నారు. కాగా కంపెనీల అధికారులు, పరిశ్రమల సంఘం అసోచామ్ లెక్కల ప్రకారం యుఎస్‌లో తిరస్కరణకు గురవుతున్న వీసాలు 40 శాతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలకు సంబంధించిన నిబంధనలను తమ స్పష్టంగా తెలియజేయాలని యుఎస్ అడ్మినిస్ట్రేషన్‌తో పరిశ్రమ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.  దేశంలోని చాలా ఐటి కంపెనీలు ఎల్ 1 వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. దీని ద్వారా కంపెనీలు తమ అమెరికాలోని ఆఫీసుకు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుంది. హెచ్ -1బి వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఈ వీసా కింద యుఎస్ కంపెనీలు విదేశీ వర్కర్లను అనుమతించడానికి ఆస్కారం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla all set to join congress
Obama misinformed on indian economy govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles