Obama misinformed on indian economy govt

Obama misinformed on Indian economy: Govt,Obama misinformed on Indian economy,US President, FDI

Obama misinformed on Indian economy: Govt

Obama.gif

Posted: 07/16/2012 12:29 PM IST
Obama misinformed on indian economy govt

obama1

అమెరికా అధ్యక్షుడు  ఒబామా ఇండియా కు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు సిద్ధం కావాలని భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా సూచించారు. రిటైల్ (చిల్లర వర్తకం) సహా పలు రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను నిరోధించడం వల్ల భారత్‌లో వాణిజ్య వాతావరణం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో భారత ఆర్థిక విధానం, భారత్‌లోనే కానీ, అమెరికాలో నిర్ణయించబడదన్నారు. రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేందుకు మన ప్రభుత్వం ప్రయత్నించి.. విపక్షాల ఒత్తిడితో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. భారత్ 'ప్రభావవంతమైన వృద్ధిని చూపుతోందంటూ భారత ఆర్థిక పరిస్థితి పట్ల ఒబామా సంతృప్తి వ్యక్తంచేశారు. భారత వృద్ధి రేటు తగ్గడానికి అంతర్జాతీయ ఆర్థిక మందగమనమే కారణమన్నారు. భారత్ ఆలోచనలే ప్రపంచ ఆర్థిక రంగానికి చోదకశక్తి అని కీర్తించారు. అయితే, పెట్టుబడుల వాతావరణం భారత్‌లో క్రమంగా క్షీణిస్తున్నదని అమెరికా వాణిజ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. "భారత్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా కష్టమని వారు మాతో చెబుతున్నారు. రిటైల్ వంటి అనేక రంగాల్లో భారత్ విదేశీ పెట్టుబడులను పరిమితం చేయడం లేదా నిషేధించింది. నిజానికి.. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి వల్ల ఇరుదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు కలుగుతాయి. అది భారత్‌కు అవసరమైన పరిణామమే''అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక రంగంలో భారత్‌ను పోటీగా నిలపడానికి మరో దఫా ఆర్థిక సంస్కరణలకు ఇదే సరైన తరుణమని చెప్పారు. ఇరుదేశాలూ అవినీతిపై పోరు సాగించాల్సి ఉందన్నారు.

Obama misinformed on Indian economy: Govt

కాగా, భారత్‌లో పెట్టుబడుల వాతావరణం క్షీణదశలో ఉందన్న ఒబామా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మొయిలీ ధీటుగా స్పందించారు. వొడాఫోన్ లాంటి అంతర్జాతీయ లాబీయిస్టులే ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులపై ఆయనకు సరైన సమాచారం లేదని చెప్పారు. భారత ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేయలేదని కొందరి ప్రభావం వల్లే చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా మండిపడ్డాయి. "అమెరికా తన మార్కెట్లను తెరవదు గానీ, భారత్ మార్కెట్లను తెరవాలంటుంది. రిటైల్‌లో ఎఫ్‌డీఐలకు ద్వారాలు తెరవాలని ఒబామా కోరుకున్నంత మాత్రాన భారత్‌కు ఆ అవసరం లేదు' అని బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా అన్నారు.కాశ్మీర్ సమస్యపై భారత్ వైఖరిని తొలిసారి, బాహాటంగా అమెరికా సమర్థించింది. ఈ సమస్యను గోరంతలు కొండంతలు చేస్తూ ప్రపంచ వేదికలను ఆకర్షించడానికి దాయాది పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. సమస్య నెలకొన్న దేశాలే, ఆ సమస్యను పరిష్కరించుకోవాలని (ద్వైపాక్షిక సంప్రదింపులు) చాలాకాలంగా భారత్ చేస్తున్న వాదనకు అగ్రదేశం ఇన్నాళ్లకు చెవి వగ్గింది. కాశ్మీర్ సమస్యకు బయట నుంచి పరిష్కారం కనుగొనలేమని అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ప్రకటించారు. చివరకు అమెరికా అయినా సరే, బయట నుంచి బలవంతంగా పరిష్కారాలను రుద్దడానికి లేదని ఆయన తేల్చిచెప్పారు.  అదే సమయంలో పాక్‌కు సుతిమెత్తగా వాతపెట్టారు. "దేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. ఒక ప్రజాస్వామిక, సుసంపన్న, సుస్థిర పాకిస్థాన్‌ను చూడాలనేది మా ఆకాంక్ష'' అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rising visa costs may pinch it firms profits
Dunn pulls out of games after failing drugs test  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles