Surjeet singh crosses over to india after 31 years in pakistan jail

Surjeet Singh crosses over to India after 31 years in Pakistan jail,India, Pakistan, Diplomacy, Surjeet Singh, Pakistan Army Act, Economy and Politics, Political Economy

Surjeet Singh crosses over to India after 31 years in Pakistan jail

Surjeet.gif

Posted: 06/29/2012 10:52 AM IST
Surjeet singh crosses over to india after 31 years in pakistan jail

Surjeet Singh crosses over to India after 31 years in Pakistan jail

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 31ఏళ్ళ తరువాత మాతృదేశంలో అడుగుపెట్టిన సుర్జీత్‌సింగ్ ఆనందపారవశ్యంతో పులకించిపోయాడు. మూడు దశాబ్దాల పాటు పాకిస్తాన్ జైల్‌లో మగ్గిన 69 ఏళ్ళ సుర్జీత్‌సింగ్ వాఘా సరిహద్దు దాటి భారత్‌లో ప్రవేశించాడు. లాహోర్‌లోని కోట్‌లఖ్‌పట్ జైలు నుంచి ఉదయం విడుదలైన అతడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షద్వానాల మధ్య భారత్‌లో ప్రవేశించాడు. తొలుత వాఘాకు ఆవలివైపున పాకిస్తాన్‌లో అన్ని అధికార లాంఛనాలు పూర్తిచేసుకుని పట్టలేనంత సంతోషంలో సుర్జీత్ ఇటువైపు నడిచాడు. అతడికి ఎర్ర శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో కుటుంబ సభ్యు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుర్జీత్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. ‘30 ఏళ్ళ తరువాత నా పిల్లలను కలుసుకోనుండడం నాకెంతో సంతోషంగా ఉందని’ అన్నాడు.

Surjeet Singh crosses over to India after 31 years in Pakistan jail

పాకిస్తాన్ జైలులో ఖైదీగా తానెలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని సుర్జీత్ చెప్పుకొచ్చాడు. తిండికి బట్టకు లోటులేకుండానే గడిపాన్నాడు. మరణశిక్షకు గురైన సింగ్‌ను లాహోర్‌లో ఖైదీగా ఉంచారు. ఉరికంబం వరకూ వెళ్లి విముక్తిపొందిన సుర్జిత్‌ను ‘మీ కుటుంబ సభ్యులకు ఏదైనా సందేశం ఇస్తారా?’ అన్న ప్రశ్నకు లేదు అని సమాధానం ఇచ్చాడు. 1980లో గూఢచర్యం అభియోగంపై అరెస్టయిన సుర్జీత్‌కు పాకిస్తాన్ సైనిక చట్టం కింద మరణశిక్ష పడింది. అయితే 1989లో అప్పటి అధ్యక్షుడు గులాం ఇషాక్‌ఖాన్ మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాడు. భారత్ విదేశీమంత్రిత్వశాఖ పలుదఫాలుగా జరిపిన చర్చలు ఫలించి సుర్జీత్ విడుదలకు దారితీసింది. కాగా పాకిస్తాన్ భద్రతా సిబ్బంది సుర్జీత్‌సింగ్‌ను వెంటబెట్టుకుని వచ్చి సరిహద్దులో భారత్ అధికారులకు అప్పగించారు. సింగ్ భారత్‌లోకి ప్రవేశించే క్షణాల్లో అతడి భార్య హర్బన్స్ కౌర్, కుమారుడు కుల్విందర్ సింగ్, కోడలు, మనుమలు, గ్రామస్థులు కేరింతలు కొట్టారు. గ్రామానికి చేరుకున్న వెంటనే స్వర్ణదేవాలయం దర్శించనున్నట్టు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nithyananda ranjitha scandal
Beautiful russian girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles