Competition panel slaps rs 6300 cr fine on 11 cement makers

Competition panel slaps Rs 6,300-cr fine on 11 cement makers, cement manufacturers, cement cartel, competition panel, competition commission, cement pricing,

Competition panel slaps Rs 6,300-cr fine on 11 cement makers

cement.gif

Posted: 06/22/2012 11:43 AM IST
Competition panel slaps rs 6300 cr fine on 11 cement makers

Competition panel slaps Rs 6,300-cr fine on 11 cement makers

దేశంలోని పలు సిమెంట్‌ కంపెనీలు కుమ్మక్కు అయి కొనుగోలు దార్లను భారీగా దోపిడి చేశాయి. ఈ కంపెనీలన్నీ జట్టుగా ఏర్పాడి ధరను పెంచి అమ్మకాలు చేసిన విధానాన్ని భారత కాంపిటీషన్‌ కమిషను గుర్తిం చింది. 2002 కాంపిటీషను చట్టంలోని పలు నిబంధనలను ఉల్లంఘించిన తీరును కనుగొంది. పోటీని నివారించే ఒప్పందాలు, స్వీయ ప్రయోజనాల కోసం కంపెనీలు కుమ్మక్కవడం వంటి అంశా లను కాంపిటీషను కమిషను పరిశీలి స్తుంది. భారత బిల్డర్ల సంఘం దాఖలు పరిచిన సమాచారం ఆధారంగా కమిషను డైరెక్టర్‌ జనరల్‌ దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో 11 సిమెంటు ఉత్పత్తి కంపెనీలు చట్ట ధిక్కారానికి పాల్పడ్డాయని గుర్తించారు. ఇందుకుగాను ఆయా 11 కంపెనీలకు రూ.6000 కోట్ల జరిమాన విధిస్తున్నట్లు ప్రకటిం చారు. అదే క్రమంలో సిమెంటు ఉత్పత్తిదారుల సంఘానికీ జరిమాన విధిస్తున్నట్లు ప్రకటించారు. జరిమాన మొత్తాన్ని 90 రోజుల గడవులోగా కమిషనుకు జమ చేయాలని ఆదేశించారు. మార్కెట్లో లావాదేవీలన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 2009-10, 2010-11 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన తమ వార్షికాదాయాలను నిజ ఆదాయాల కన్నా 0.5 రెట్లు అధికంగా చేసి ఈ 11కంపెనీలు చూపాయని కమిషనుకు దాఖలు పరిచిన సమాచారంలో బిల్డర్లు పేర్కొన్నారు.

జరిమాన విధింపునకు గురయిన కంపెనీల జాబితాలో ఎసిసి, అంబూజ, ఆల్ట్రటెక్‌, దీంతోనే విలీనమైన గ్రసీం, జెకె, ఇండియా, మద్రాసు, సెంచురీ, బినానీ, లఫర్జీ ఇండియా, జేపీ సిమెంటు కంపెనీలు ఉన్నాయి.  మార్కెట్లోకి సిమెంటు సరఫరా చేసే విషయం లోనూ, దాని ధరను నిర్ణయించే విషయంలోను ఈ కంపెనీలన్నీ ఏకరూప సమన్వయ ధోరణిని అవలంబించాయని కమిషను వ్యాఖ్యానించింది. మార్కెట్లో డిమాండ్‌ అధికంగా ఉన్న సమయాన్ని సరఫరా తగ్గింపుకు ధరల పెరుగుదలకు అనుకూలంగా వాడుకోలేకపోయాయని కంపెనీల తీరును కమిషను ఆక్షేపించింది. మార్కెట్లోకి సిమెంటు సరఫరాలను పరిమితం చేయడంలోనూ, ధరలను నిర్ణయించడం- నియంత్రిం చడంలోనూ కుమ్మక్కయిన కంపెనీలు వ్యవహరించిన తీరు నేరుగా వినియోగ దారుల ప్రయోజనాలకు భంగకరంగా నిలిచిందని కమిషను తప్పు పట్టింది. పరోక్షంగా మొత్తం ఆర్ధిక వ్యవస్థనే కుదిపేసిందని తెలిపింది. దేశ పురోభివృద్ధి, ఆర్దిక వ్యవస్థల్లో అతి కీలక మైన నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో సిమెంటు అనేది చాల ముఖ్యమైనందున ఆయా కంపెనీల వ్యవహారశైలి నష్టదాయకంగా పరిణమించిందని కమిషను వ్యాఖ్యానించింది. కాగా ఉత్పత్తి, సరఫరా, టోకు-చిల్లర ధరలకు సంబంధించిన సమాచారాన్ని తమలో తాము పంచుకోరాదని సిమెంటు ఉత్పత్తిదారుల సంఘాన్ని(సిఎంఎ) కమిషను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabadi killed in uganda
Cbi jd laxmi narayana exposed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles