Cbi jd laxmi narayana exposed

CBI JD Laxmi Narayana Exposed, YS Jagan Party, leaders, Chanra bala, Media, Phone,

CBI JD Laxmi Narayana Exposed

CBI1.gif

Posted: 06/21/2012 04:59 PM IST
Cbi jd laxmi narayana exposed

CBI JD Laxmi Narayana Exposed

ఇప్పటి వరకు సైలెంట్ జేడి లక్ష్మీనారాయణ మాత్రమే తెలుసు.  అలాంటి జేడి కి జగన్ పార్టీ నాయకులు  కోపం తెప్పించారు.  ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయటం  జగన్ పార్టీకి అలవాటుగా మారింది. నిజాయితీ గల అధికారులపై  నింధలు వేయటం జగన్ పార్టీ కే చెల్లింది.  మేము ఏం చేసిన  ప్రజలు నమ్మతార్లే  అంటు జగన్ పార్టీ నాయకులు చిన్న చిన్న విషయాలను రాజకీయం చేయటం  ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఏదోక ఒకరోజు ప్రజలే తిరగబడతారు.  అసలు విషయం ఏమిటయ్యా అంటే.. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులకు,చంద్రబాల అనే మహిళకు చేసిన కాల్స్ జాబితా వ్యవహారం సంచలనంగా మారింది.దీనిపై లక్ష్మీనారాయణ సీరియస్ అయినట్లు కధనాలు వస్తున్నాయి. సాక్షి చానల్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ఈ కాల్ జాబితాను విడుదల చేసి ఎవరీ చంద్రబాల అని ప్రశ్నిస్తున్న సమచారం వచ్చిన వెంటనే ఆయన సిబిఐ సీనియర్ అదికారులతో భేటీ అయినట్లు సమాచారం వస్తోంది. దీనికి కొంతకాలం క్రితం వరకు నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న ఎకె ఖాన్ కూడా హాజరవడం ఆసక్తికరంగా ఉంది. కాల్ డేటా లీక్ అయిన తీరు, ఎలా లీక్ అయిందన్నదానిపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.సిబిఐ మాన్యువల్ ప్రకారం సిబిఐ లో అదికార ప్రతినిధి తప్ప మరెవరూ మీడియాతో మాట్లాడరాదని ఉందని, దానిని లక్ష్మీనారాయణ ఉల్లంఘించారని, ప్రత్యేకించి జగన్ ను వ్యతిరేకించే మీడియాతోనే ఎక్కువగా మాట్లాడారన్న అభియోగాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ చేస్తోంది.అదే సమయంలో చంద్రబాట అనే మహిళతో ఆయన మాట్లాడడం, ఆమె ఆంద్రజ్యోతి ఎమ్.డి.తో మాట్లాడినట్లు ఉన్నట్లుగా వీరు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది చూడాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Competition panel slaps rs 6300 cr fine on 11 cement makers
Mantralaya fire spreads in mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles