Telangana issue has reached a flash point tg

Minor Irrigation Minister T G Venkatesh on Tuesday stated that the Telangana issue has reached a flash point.

Minor Irrigation Minister T G Venkatesh on Tuesday stated that the Telangana issue has reached a flash point.

Telangana issue has reached a flash point TG.gif

Posted: 06/19/2012 08:49 PM IST
Telangana issue has reached a flash point tg

TG-Venkateshరాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టి.జి. వెంకటేష్ తెలంగాణకు సంబంధించి ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆయన ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.... త్వరలో తెలంగాణ సమస్యకు సంబంధించిన ఓ స్పష్టమైన ప్రకటన వస్తుందని అన్నారు. తెలంగాణ విభజన అంశం తుది ఘట్టానికి చేరుకుందని, తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వపక్ష, విపక్ష పార్టీల నేతలతో ఎలాంటి విభేదాలు లేవని, ఎవరి లక్ష్యాల కోసం వారు పోరాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనపై పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తమ ప్రాంత ప్రజలకు చెప్పుకోవడానికి ముందుగా తమకు వివరించాలని అన్నారు. ఇప్పటికే తెలంగాణపై దాదాపు అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని, కాంగ్రెసు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, త్వరలో అధిష్టానం తమ నిర్ణయాన్ని చెబుతుందన్నారు. కాంగ్రెసు తన నిర్ణయం తీసుకుంటే ఇక ఏ శక్తి ఆపలేదన్నారు.

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారేమో అనే ఆందోళన కలుగుతోందన్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేయాల్సి వస్తే రాయలసీమ నేతలకు ముందుగా చెప్పాలన్నారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకునే రోజు మాత్రం వచ్చిందన్నారు. 2009 వలే అర్ధరాత్రి ప్రకటనలు చేయవద్దని కోరారు. తెలంగాణ ఇస్తే తెరాసను రద్దు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed allowed to record statements of scam accused under pmla
Pakistan to get new pm as sc disqualifies yousuf raza gilani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles