Clyconic strome in bay of bengal

clyconic strome in bay of bengal

clyconic strome in bay of bengal

3.1.gif

Posted: 06/18/2012 03:48 PM IST
Clyconic strome in bay of bengal

      2.1ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల పురోగతి ఫలితంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
      ఇదిలా ఉండగా,  ఎండాకాలంలో నిప్పుల కొలిమిని తలపించిన రాష్ట్రం చల్లబడింది. రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. భానుడి ప్రకోపానికి నానా అవస్థలు పడ్డ ప్రజలు ఇప్పుడు హాయిగా సేద తీరుతున్నారు. కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, కర్ణాటకలోని పలు ఇతర ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 8న కేరళ తీరంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు దాదాపు దక్షిణాది అంతా విస్తరించినట్లయింది.2.2 ప్రస్తుతం కేరళలో మాత్రమే నైరుతి రుతుపవనాలు పూర్తి క్రియాశీలంగా ఉన్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా.. కొన్ని చోట్ల మోస్తరుగా వానలు పడుతున్నాయి. వర్షాలు వాతావణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. తొలకరి పలకరింపుతో ప్రజలు పరవశించిపోతున్నారు.
      ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణం కన్నా 90శాతంపైగా వర్షాలు పడతాయని బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే ఆశించినదానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతికి తోడు ఒడిషా దక్షిణ తమిళనాడు మీదుగా రాయలసీమ, తెలంగాణ వైపు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాగల 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేశ పశ్చిమ తీరంతోపాటు ఒడిషా, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతాలు, సిక్కింలలో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ దక్షిణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వానలు కురుస్తాయంది.
    2.4  కాగా,  హైదరాబాద్ కూకట్‌పల్లిలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోవడంతో సాగరాన్ని తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇటు హైటెక్ సిటీ రైల్వే బ్రిడ్జీ వద్ద నీరు ఏరులా పారుతుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ ఉద్యోగస్థులు ట్రాఫిక్ ఇబ్బందులను సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political parties strength change in assembly
Newly elected mlas take oth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles