Political parties strength change in assembly

political parties strength change in assembly

political parties strength change in assembly

1.1.gif

Posted: 06/18/2012 03:58 PM IST
Political parties strength change in assembly

      ఉపఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ, టీఆర్ఎస్ లు బలం పుంజుకోగా, కాంగ్రెస్, టీడీపీలు నష్టపోయాయి. అయితే గుడ్డిలో మెల్లగా కాంగ్రెస్  రెండు స్థానాలను కైవసం చేసుకొని ఊరట చెందగా తెలుగుదేశానికి అది కూడా దక్కలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో ఓడిపోయినా ఆ పార్టీ బలంలో మాత్రం మార్పు లేదు. తాజాగా ఉపఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.3.1
   కాంగ్రెస్ పార్టీకి 155మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ఏడుగురు ఎంఐఎం శాసనసభ్యుల మద్దతు తీసుకుంటే ఆ పార్టీ సంఖ్యా బలం 162. ఇందులో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ బలం 160మంది ఎమ్మెల్యేలు. ఇక తెలుగుదేశానికి 86మంది శాసనసభ్యులు ఉండగా టీఆర్ఎస్, వైసీపీ బలం పుంజుకున్నాయి. ఈ ఉపఎన్నికలకు ముందు ఇద్దరే ఉన్న వైసీపీ సభ్యుల బలం 15నుంచి 17కు పెరిగింది. టీఆర్ఎస్ బలం అంతకుముందు 16ఉండగా పరకాల స్థానంతో 17కు చేరింది.
   ఇక సీపీఐకి నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క సీపీఎం ఎమ్మెల్యే, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, లోక్ సత్తాకు ఒక ఎమ్మెల్యే ఉండగా స్వతంత్ర సభ్యులు ముగ్గురు అసెంబ్లీలో ఉన్నారు. అయితే వీరిలో కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఉండగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి మాత్రం ఏ పార్టీతో కలవక తటస్థుడిగా ఉన్నారు.
    కాగా, ఉప ఎన్నికల్లో ఓటమిపై సొంతపార్టీ నుంచే విమర్శలు తీవ్రమవుతుండటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ సమన్వయ కమిటీని సమావేశపరిచేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు గాంధీభవన్ లో సమన్వయ కమిటీ భేటీ కానుంది. కాగా ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ హాజరు కావటం లేదు. ఉప ఎన్నికల ఓటమికి దారితీసిన పరిస్థితులపై ఈభేటీలో సమీక్ష జరపనున్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apj abdhul kalam rejection
Clyconic strome in bay of bengal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles