Newly elected mlas take oth

newly elected mlas take oth

newly elected mlas take oth

2.1.gif

Posted: 06/18/2012 03:40 PM IST
Newly elected mlas take oth

      ఉప ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఇవాళ (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. 1.1పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తపల్లి సుబ్బారాయుడు, వరంగల్ జిల్లా పరకాల స్థానం నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి స్పీకర్‌ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ తన గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. గతంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేసిన ఆయన 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్‌, పితాని సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.      1.2 మరోవైపు, పరకాల ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత భిక్షపతి ఈ ఉదయం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన పరకాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు కేటీఆర్, తదితరులు హాజరయ్యారు.
     కాగా, పరకాలలో 99శాతం ప్రజలు తెలంగాణ వాదానికే పట్టం కట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 1.3కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంసీపీఐ తప్ప మిగతా పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమనే చెప్పాయని హరీష్ రావు అన్నారు. ఎంసీపీఐకి వచ్చిన ఓట్లు కేవలం 805 ఓట్లు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే సమైక్యాంధ్ర అన్న లగడపాటిని సీమాంధ్ర ప్రజలు తిప్పికొట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు అడ్డుకాదని....కొందరు పెట్టుబడిదారులే అడ్డుకుంటున్నారని హరీష్ రావు అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Clyconic strome in bay of bengal
Judge pattabhi ramarao son arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles