Einstein was rightneutrino researchers admit

Scientists on Friday said that an experiment which challenged Einstein's theory on the speed of light had been flawed and that sub-atomic particles -- like everything else -- are indeed bound by the universe's speed limit

Scientists on Friday said that an experiment which challenged Einstein's theory on the speed of light had been flawed and that sub-atomic particles -- like everything else -- are indeed bound by the universe's speed limit

Einstein was right_neutrino researchers admit.gif

Posted: 06/09/2012 04:47 PM IST
Einstein was rightneutrino researchers admit

einestein"కాంతి కంటే వేగంగా ప్రయాణించేది ఏదీ లేదు'' అని ఐన్‌స్టీన్ చెప్పిన సిద్ధాంతం తప్పని.. కంటికి కనిపించని అత్యంత సూక్ష్మమైన న్యూట్రినోలు కాంతికన్నా సెకనుకు 6 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయని.. కొద్ది నెలల కిందట ప్రకటించిన సెర్న్ (యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్) శాస్త్రవేత్తలు ఇప్పుడు నాలుక్కర్చుకున్నారు. అప్పుడు తాము చెప్పింది తప్పని, ఐన్‌స్టీన్ సిద్ధాంతమే సరైనదని ఒప్పుకొన్నారు.

కాంతి కంటే వేగవంతమైనదేదీ లేదన్న ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి న్యూట్రినోలు సైతం లోబడే పనిచేస్తాయని క్యోటోలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ న్యూట్రినో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్'లో ప్రకటించారు. న్యూట్రినోల వేగంపై 2011, సెప్టెంబరులో వారు చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అప్పట్లో వారు ప్రయోగించిన న్యూట్రినోలు 732 కిలోమీటర్ల దూరాన్ని 0.0024 సెకన్లలో ఛేదించాల్సి ఉండగా.. 0.00000006 సెకన్ల ముందుగానే చేరుకున్నాయి. వారు కాంతికంటే న్యూట్రినోల వేగం అధికం అంటూ చేసిన ప్రకటన ఆధునిక భౌతికశాస్త్రానికే సవాల్‌గా నిలిచింది. అప్పట్లో వారు చేసిన ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకునేందుకు ఇకారస్ పేరిట ప్రాజెక్టును చేపట్టి మరోసారి ఏడు న్యూట్రినోలను ప్రయోగించారు. అందులో ఫలితాలు ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి అనుగుణంగా వచ్చాయని ఇకారస్ ప్రాజెక్టు అధికార ప్రతినిధి కార్లో రబ్బియా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By election campaign coming to an end today
Rbi allows more nri remittances  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles