By election campaign coming to an end today

by election campaign coming to an end today

by election campaign coming to an end today

1.gif

Posted: 06/10/2012 01:41 PM IST
By election campaign coming to an end today

      ఉపఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఉప ప్రచారం పరిసమాప్తం కానుంది.1 ఇవాళ (ఆదివారం) సాయంత్రం 5గంటలతో ప్రచార అంకం పరిసమాప్తం కానుంది. కాగా, ఏప్రిల్  24న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అంతకంటే ముందు నుంచే రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం మొదలు పెట్టాయి. పరస్పర విమర్శలతో హోరెత్తించాయి. అభ్యర్థుల గెలుపు కోసం తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలు ప్రయోగించాయి. ఓట్లు కూడబెట్టుకునేందుకు ఇక కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు బిజీబిజీగా ప్రచారాన్ని ముగించే ప్రయత్నాల్లో ఉన్నాయి.
     మరోవైపు కొద్దిసేపటిక్రితం ఉపఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ 12జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి వచ్చిన స్థానికేతర నేతలు ఈ సాయంత్రానికి ఊళ్లు వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసారి నిశ్శబ్దంగా ఇంటింట ప్రచారం చేసేందుకు కూడా అభ్యర్థులను అనుమతించ బోమని తెలిపారు. 2 ఈ సాయంత్రం 5 గంటల నుంచి 12వ తేది రాత్రి వరకు మద్యం దుకాణాలు బంద్  చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని భన్వర్ లాల్ విజ్ణప్తి చేశారు.  ఓటరు స్లిప్ లేదా ఓటరు గుర్తింపు కార్డును తప్పని సరిగా తీసుకు వెళ్లాలని లేకుంటే ఓటింగ్ కు అనుమతించబోమని తెలిపారు.
   3 ఎక్కడైనా డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్కాడ్ లకు 8897000401, 8897000402. 8897000403 సెల్ నెంబర్లకు ఎస్సెమ్మెస్  ద్వారా సమాచారం అందించాలని భన్వర్ లాల్ కోరారు. ఈ అవకాశాన్ని ఓ బాధ్యతగా తీసుకుని ప్రజలు స్పందించాలని బన్వర్ లాల్ శూచించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aieee exam results release today
Einstein was rightneutrino researchers admit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles