Rbi allows more nri remittances

RBI allows more NRI remittances,reserve bank of india,NRI remittance,Indian currency,foreign currency

RBI allows more NRI remittances

RBI.gif

Posted: 06/09/2012 04:07 PM IST
Rbi allows more nri remittances

RBI allows more NRI remittances

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) దేశానికి తరచుగా మరింత డబ్బును పంపేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజాగా అనుమతినిచ్చింది. దేశానికి విదేశీ నిధుల ప్రవాహం పెరిగేందుకు, తద్వారా విదేశీ మారకపు నిధులు మరింతగా అందుబాటులోకి రావడానికి, రూపాయి బలహీనతను అరికట్టడానికి ఈ చర్య దోహదపడనుంది. ఇక మీదట ఎన్‌ఆర్‌ఐలు తాము నివసిస్తున్న దేశాల నుంచి స్వదేశంలోని తన వారికి 30 సార్లు డబ్బు పంపవచ్చు. ఇంతక్రితం 12 సార్లకు మాత్రమే అనుమతి ఉండేది. కాగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) వ్యవస్థ ద్వారా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (ఈ పేమెంట్) పరిమితిని శనివారానికి ప్రస్తుత రూ. 2 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదిలాఉండగా, తమ ఆదాయపు పన్ను (ఐటీ) బకాయిల చెల్లింపుల విషయంలో కస్టమర్లు చివరి నిమిషంలో ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్‌బీఐ తాజా చర్య తీసుకుంది. తమ బకాయిలను ముందస్తుగా చెల్లించేందుకు ఎస్‌బీఐ, ఎస్‌బీటీ, ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచీలలో చెక్కులు లేదా నగదు రూపంలో ఐటీ బకాయిలు చెల్లించవచ్చని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Einstein was rightneutrino researchers admit
Cbi arrests abhishek verma wife in bribery case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles