Hampi express accident 24 charred to death

Hampi Express, Andhra Pradesh, Train collision, Train accident, Penukonda, Anantapur, Indian Railways, Mukul Roy

Eighteen people have been charred to death and over 35 have been injured after the Hampi Express collided with a stationary goods train at Penukonda in the Anantapur district of Andhra Pradesh early on Tuesday morning. The accident happened at around 3:15 am on Tuesday

Hampi Express accident 24 charred to death.gif

Posted: 05/22/2012 12:13 PM IST
Hampi express accident 24 charred to death

Humpi-expressఅనంతపురం జిల్లాలోని పెనుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. 17 మంది సజీవదహనం కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రైన్ డ్రైవర్ కూడా మృతి చెందారు. ఆగివున్న గూడ్స్ రైలును హంపి ఎక్స్‌ప్రెస్ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్‌రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్‌ ను ఢీకొన్న వెంటనే హంపి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. భోగీల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో కొందరు ప్రయాణికులు సజీవదహం అయ్యారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణంగా భావిస్తున్నారు. ఆగివున్న గూడ్స్ ట్రాక్ పైకి హంపి ఎక్స్ ప్రెస్ ని అనుమతించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేస్తూ, సహాయ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని ఎంపీలు చిరరంజీవి, మంత్రులు శైలజానాథ్, రఘువీరా రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం పై కేంద్ర రైల్వే మంత్రి ముఖుల్ రాయ్ మరణించిన వారికి 5 ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Palvai govardhan reddy blamed kcr
Chandrababu naidu all free  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles