Mamata banerjee defends shahrukh khan on the wankhede fiasco

Mamata Banerjee defends Shahrukh Khan on the Wankhede fiasco,baadshah of bollywood,king khan,king khan banned,mamata-banerjee gossip,shahrukh banned,shahrukh in west bengal,shahrukh khan,srk,srk banned,wankhede,west bengal

Mamata Banerjee defends Shahrukh Khan on the Wankhede fiasco

Mamata.gif

Posted: 05/19/2012 10:59 AM IST
Mamata banerjee defends shahrukh khan on the wankhede fiasco

Mamata Banerjee defends Shahrukh Khan on the Wankhede fiasco

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంసిఏ తీరును తప్పుపట్టారు. అనేక మంది సినీ ప్రముఖులు షారూఖ్‌కు మద్దతు తెలిపారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని ఖాన్‌పై ఎంసిఏ నిర్ణయాన్ని పునసమీక్షించాలని మమత విజ్ఞప్తి చేశారు. షారూఖ్ పశ్చిమబెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వాంఖడే స్టేడియంలో భద్రతా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఖాన్‌పై ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఏ) ఐదేళ్ళ నిషేధం విధించింది. ఎంసిఏ చర్యను పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖలు నిరసించారు. ‘దేశ వాణిజ్య రాజధాని ముంబయిని నేనెంతో ప్రేమిస్తాను.

షారూఖ్, సచినే కాదు మహారాష్ట్రీయులను బెంగాల్ ప్రజలు ఎంతో అభిమానిస్తారు. పైగా ఖాన్ మా అంబాసిడర్ కూడాను’ అని మమత స్పష్టం చేశారు. బాద్‌షాపై నిషేధానికి సంబంధించి దయచేసి పునపరిశీలించాలని ఎంసిఏను ఆమె అభ్యర్థించారు. ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఏకంగా ఐపిఎల్‌నే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. షారూఖ్‌పై నిషేధం విధించిన అంశాన్ని మీడియా ఆయన దృష్టికి తీసుకురాగా ‘ఐపిఎల్‌ను మూసేయాలి’ అన్నారు. అనేక వివాదాలకు కేంద్రమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. అయితే షారూఖ్ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం ఉండదని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.

Mamata Banerjee defends Shahrukh Khan on the Wankhede fiasco

పార్లమెంటు వెలుపల ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎంసిఏ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని అంటూ, షారూఖ్ ఉదంతంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. బాలీవుడ్ మొత్తం షారూఖ్ ఖాన్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. ‘షారూఖ్ అందరు తండ్రులులాగే ప్రవర్తించారు. బాధ్యత గల తండ్రిగా ఖాన్ ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యారు’ అని దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. ఖహానీ దర్శకుడు సుజయ్ ఘోష్ మాట్లాడుతూ బాద్‌షా ఎంతో బాధ్యత నెరిగిన తండ్రి అన్నారు.

ఆ సమయంలో ఖాన్ స్థానంలో ఏ తండ్రి ఉన్నా అంతే. అందులో తప్పేమీ లేదు అని దర్శకుడు అనురాగ్ బసు స్పష్టం చేశారు. ఎంసిఏ చర్యను గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ దడ్లానీ తప్పుపట్టారు. కుమార్తెకు జరిగిన అవమానం భరించలేకే తానలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పడాన్ని బట్టే ఆయన పెద్ద మనసును అర్థం చేసుకోవచ్చని టివీ నటి రోణిత్ రాయ్ వ్యాఖ్యానించారు. ఖాన్‌ను ఒక నటుడిగా చూడడం సరికాదు. తండ్రిగా ఆయన ప్రవర్తించిన తీరు న్యాయమేనని నటి సెలీనా జైట్లీ చెప్పారు. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి కూడా ఐపిఎల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Threatened to withdraw case against pomersbach
Vayalar ravi attacks ysjagan mohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles