Vayalar ravi attacks ysjagan mohan reddy

Vayalar Ravi attacks Y.S.Jagan Mohan Reddy,Vayalar Ravi, is against targeting the late YS Rajasekhara Reddy, Vayalar Ravi respond on Jagan comments

Vayalar Ravi attacks Y.S.Jagan Mohan Reddy

Vayalar.gif

Posted: 05/19/2012 10:54 AM IST
Vayalar ravi attacks ysjagan mohan reddy

Vayalar Ravi attacks Y.S.Jagan Mohan Reddy

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున సమన్వయకర్తలను పిసిసి నియమించింది. ఆ సమన్వయకర్తలతో వాయలార్ రవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాయలార్ రవి వారినుద్ధేశించి ప్రసంగిస్తూ, కొన్ని సలహాలు, సూచనలు చేశారు. జగన్‌ను తరచూ విమర్శించాల్సిన పని లేదని అన్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జగన్ వైపు పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళుతున్నారన్న ఆందోళన అవసరం లేదని ఆయన అన్నట్లు తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదే పనిగా విమర్శించి పెద్దవాన్ని చేయకండి అని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వాయలార్ రవి పార్టీ సమన్వయకర్తలకు సూచించారు.

కాంగ్రెస్‌కు బ్యాంకు ఉందని ఆయన తెలిపారు. అందరూ కలిసి పని చేయాలని ఆయన సూచించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేయలేదని అన్నారు. జగన్ వైఎస్ కుమారుడు కాబట్టి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ కుటుంబం ఎంతో లబ్ది పొందిందని, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే పార్టీని విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలను తిప్పికొట్టాలని ఆయన తెలిపారు. సమన్వయకర్తలు తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్ళి, అభ్యర్థులకు భారం కాకుండా, స్వయంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. అవసరమైతే పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన చెప్పారు. సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం వాయలార్ రవి చెన్నై బయలుదేరి వెళ్ళారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee defends shahrukh khan on the wankhede fiasco
All parties shift there focus upon parakala segment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles