All parties shift there focus upon parakala segment

All Parties Shift There Focus Upon Parakala Segment

All Parties Shift There Focus Upon Parakala Segment

Parakala.gif

Posted: 05/19/2012 10:46 AM IST
All parties shift there focus upon parakala segment

కాంగ్రెస్, తెరాస, వైకాప, బిజెపి, టిడిపిలు ప్రతిష్టగా తీసుకున్న నేపథ్యంలో..గెలుపును అభ్యర్థులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొందరికి చావో, రేవో అన్నట్లుగా మారింది. ఈ క్రమంలో ఒక పార్టీ నాయకులు ‘పొరుగు’ కార్యకర్తలను పరకాల సెగ్మెంట్‌కు భారీగా తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది. అన్ని గ్రామాలకు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ‘కేవలం ప్రచారం కోసమే కాదు..వీరంతా స్థానిక పరిస్థితులను తెలియచేసేందుకు నిఘా వ్యక్తులుగా కూడ ఉపయోగపడతారు’ అని ఒక రాజకీయపార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.  

తెలంగాణలో ఏకైక ఉపఎన్నిక జరుగుతున్న వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వందలాదిమంది ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు చేరుకున్నారా..? ఎన్నికలనాటి వరకు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు మారణాయుధాలు, నాటుబాంబులను కూడా సెగ్మెంట్‌కు తరలించారనే ప్రచారం సాగుతోంది. తమకు అనుకూలంగా ఉన్నదెవరు? ఎవరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, ఎన్నికలకు ఉపయోగంగా వారిని మార్చుకోవాలంటే ఏం చేయాలి? తదితర సమాచారాన్ని ఈ పొరుగు ‘వేగు’ల ద్వారా ఎప్పటికప్పుడు సదరు రాజకీయ పార్టీ అభ్యర్థి సేకరిస్తూ.. అందుకు అనుగుణంగా తాజా వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఆరంభంకాగా..వచ్చేనెల 12 న  జరిగే పోలింగ్ వరకు నియోజకవర్గంలోని పరిస్థితిని అంచనా వేసి, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ పొరుగు కార్యకర్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vayalar ravi attacks ysjagan mohan reddy
Cm kiran kumar reddy direct comments on ysjagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles