Cm kiran kumar reddy direct comments on ysjagan

CM Kiran Kumar Reddy direct comments on Y.S.Jagan, Chandra babu naidu, TDP Party, By election, anathapuram, kanekal, bommanahal mandal, roadshow,

CM Kiran Kumar Reddy direct comments on Y.S.Jagan .

CM Kiran.gif

Posted: 05/19/2012 10:42 AM IST
Cm kiran kumar reddy direct comments on ysjagan

CM Kiran Kumar Reddy direct comments on Y.S.Jagan .

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్, బొమ్మనహాళ్ మండలాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడుతూ వ్యాపారాలు చేసే నాయకులకు ఓట్లేయవద్దన్నారు. ప్రజలకు సేవచేసే నాయకులనే ఎన్నుకోవాలని సూచించారు.ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేయకూడదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఒకవేళ ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేస్తే రాజకీయాల్లో వ్యాపారం మొదలవుతుంది. తద్వారా ప్రజలకు సేవచేసే నాయకులు కరువవుతారని అన్నారు. వైయస్ ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన ఘనత ఆయన కుమారుడు జగన్‌కే దక్కుతుందన్నారు. వేర్పాటువాద పార్టీ టిఆర్‌ఎస్, మతతత్వ బిజెపితో, వైయస్‌కు బద్ధశత్రువైన టిడిపితో కుమ్మక్కై వైయస్ ఆశయ సాధనకు జగన్ తూట్లు పొడుస్తున్నారన్నారు.

మామను మోసం చేసిన చంద్రబాబుకు, తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న జగన్‌కు ఏ మాత్రం తేడా లేదన్నారు. రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్నారు. 2014 వరకూ కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి అయిన తనకే కాపు రామచంద్రారెడ్డితో ఫోన్‌లో మాట్లాడడానికి వారం రోజుల సమయం పట్టేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తనకే అందుబాటులోలేని ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారని ప్రశ్నించారు. మీ మీ ప్రాంతాల్లో సహజ సంపదను కొల్లగొట్టిన వ్యక్తికి ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాలరెడ్డికి ఓటు వేయాలని కోరారు.  ఒకవేళ ఆయన గెలిస్తే ఆయనతో పనిచేయించుకోవడానికి ప్రజలు నెల్లూరు వెళ్లాల్సి ఉంటుందన్నారు. వీరిద్దరూ వ్యాపారం నిమిత్తం, డబ్బు సంపాదన కోసం ఈ నియోజకవర్గానికి వచ్చిన వ్యక్తులని, ఇలాంటి వ్యక్తులకు మీరు ఓట్లేస్తారా? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లే వ్యక్తికి ఓట్లు వేయడం వల్ల మీరు సాధించేది ఏమీ లేదన్నారు. స్థానిక అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్లను డబ్బుతో కొనాలనుకుంటున్న ఇలాంటి వ్యక్తులకు బుద్ది చెప్పాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All parties shift there focus upon parakala segment
Congress mp v hanumantha rao comments on chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles