Cell phone radiation is very dangerous

cell phone radiation, cell phone, mobile phone, mobile phone radiation, phone radiation, technology, environment, science, health, people, iphone danger

Urgent Warning this shocking video exposes everything about the dangers of cell phone radiation. Everyone..

Cell Phone Radiation is very dangerous.gif

Posted: 05/09/2012 06:35 PM IST
Cell phone radiation is very dangerous

Cell-phoneసెల్ ఫోన్ మానవుని జీవితంలో నిత్యావసర వస్తువుగా మారింది. సెల్ ఫోన్ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే ప్రాణహాని కూడా ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సెల్‌ఫోన్ వాడకం ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే అం శంపై జేఎన్‌యూ పరిశోధకుడు ఒకరు మగ ఎలుకలపై పరిశోధన చేశారు. సెల్‌ఫోన్ రేడియేషన్‌తో వాటి వీర్య కణాలతోపాటు వృషణం సైజు కూడా తగ్గిపోయింది.

ఫోన్ చేసినప్పుడు సెల్‌ఫోన్లోని యాంటెన్నా రేడియో ధార్మిక కిరణాలను విడుదల చేస్తుంది... స్వీకరిస్తుంది. వరుసగా 20 నిమిషాలపాటు మాట్లాడితే చెవి తమ్మె దగ్గర రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో బ్రెయిన్ కేన్సర్ తదితర వ్యాధులు సంక్రమించే ప్రమా దమూ ఉంటుంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మన శరీరం పీల్చుకునే రేడియేషన్ శాతాన్ని స్పెసిఫిక్ అబ్సార్ప్షన్ రేట్ (ఎస్ఏఆర్) అని అంటారు. కానీ, ప్రముఖ కంపెనీలు కూడా దీనిని తమ సెల్‌ఫోన్లపై ముద్రించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను తెచ్చింది.

'సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం' అని సిగరెట్ ప్యాకెట్‌పైనే ఉంటుంది. అలాగే, సెల్‌ఫోన్లో మాట్లాడితే మీ ఆరోగ్యానికి ఎంత ముప్పో సాక్షాత్తూ మీ సెల్‌ఫోనే చెప్పనుంది. సెప్టెంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని సెల్‌ఫోన్ కంపెనీలూ తమ మొబైల్స్‌పై ఎస్ఏఆర్‌ను ప్రముఖంగా ముద్రించాలని ఆదేశించింది. ఏ నిబంధననైనా తుంగలో తొక్కే సెల్ ఫోన్ కంపెనీలు ఎంతవరకు వీటిని పాటిస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jharkhand cm arjun munda injured in chopper crash
India is fourth worst in maternal care  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles