One day maoist bandh

Maoist bandh.gif

Posted: 05/05/2012 08:51 PM IST
One day maoist bandh

ఎన్‌సీటీసీ నల్ల చట్టంతో ప్రజ ఉద్యమాలను అణచాలని చూస్తున్న కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా మావోయిస్టు పార్టీ ఈ నెల 16న భారత్‌బంద్ కు పిలుపునిచ్చింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం బహుళజాతి కంపెనీలకు సీఈఓగా పని చేస్తున్నాడని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. దేశ సంపదను, వనరులను దోచిపెట్టడానికే భారత ప్రభుత్వాలు టాడా, పోట, ఊప లాంటి నల్లచట్టాలను తీసుకువచ్చాయని, ఆ పరంపరలోనే నేడు ఎన్‌సీటీసీ లాంటి మరో నల్ల చట్టం తీసుకరావాడనికి చిదంబరం తహతహ లాడుతున్నాడని మడిపడ్డారు.

ఇప్పటికే మధ్యభారతంలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను ఎంఎన్‌సీలకు దోచిపెట్టేందుకు ఆదివాసీ ప్రజలపై గ్రీన్‌హంట్ పేరుతో దోపిడి పాలకులు యుద్ధం చేస్తున్నారని ఆయన వివరించారు.తాజా ఎన్‌సీటీసీ చట్టంతో కేంద్రప్రభుత్వ ప్రజస్వామిక వాదుల గొంతులు నులిమివేయాలని చూస్తుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టంతో తనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను కూడా వేదించే అవాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రీన్‌హంట్‌ను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అందోళనలు తీవ్రతరం చేయల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసనగా మే 16న దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No single openian on nctc
Actress antara mali delivers a baby girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles