Tdp president chandrababu fire on ys jagan

tdp president chandrababu fire on ys jagan

tdp president chandrababu fire on ys jagan

28.gif

Posted: 05/02/2012 07:17 PM IST
Tdp president chandrababu fire on ys jagan

      babu డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల పక్కన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టి జగన్ రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడటంతో పాటు వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.  అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌ను గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు. gatuకాంగ్రెసు ప్రభుత్వ అసమర్థతను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంతో పాటు వివిధ వర్గాల వారికి టిడిపి అధికారంలో ఉండగా చేసిన మంచి పనుల్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతపురం టిడిపికి కంచుకోట అని చెప్పారు.
      కాగా, ఒత్తిడికి లోనైన చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా తిరుగుతున్నాడని జగన్ పార్టీనేత గట్టు రామచంద్రరావు అన్నారు. చంద్రబాబుది రాక్షస పుట్టుక అని ఆయన వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్‌ని బీసీ వ్యతిరేకి అని నీచంగా మాట్లాడటం తగదని గట్టు హితవు పలికారు. రాష్ట్రంలోని బీసీలంతా తమ రాజకీయ వారసుడిగా జగన్‌నే చూసుకుంటున్నారని, బీసీలను ఓట్లడిగే హక్కు జగన్‌కే ఉందని గట్టు తెలిపారు. బీసీల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో ఇప్పటికైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకు ఏం చేశావో చెప్పాలని గట్టు డిమాండ్ చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coming soonpost bank of india
Trs leader ktr blame late ysr and his son jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles