Trs leader ktr blame late ysr and his son jagan

trs leader ktr blame (late) ysr and his son jagan

trs leader ktr blame (late) ysr and his son jagan

24.gif

Posted: 05/02/2012 07:07 PM IST
Trs leader ktr blame late ysr and his son jagan

      ktవైఎస్ చేసిన పాపాలు జగన్ జోబులు నింపాయని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ పరకాలలో టీఆర్ఎస్‌దే విజయమన్నారు.ఆంధ్ర పెత్తందార్ల పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని కేటీఆర్ పేర్కొన్నారు.
       కాగా,  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన రాజకీయ గురువని, ఆయనను ఒక్క మాట అన్నా ఊరుకోనేది లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలలోపు తెలంగాణ ప్రకటిస్తేనే పరకాలలో గెలుస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.komati
      ఇదిలా ఉండగా,  పరకాల అభ్యర్ధిత్వ విషయంపై హైకమాండ్ మరోసారి ఆలోచించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌తో గండ్ర దంపతులు సమావేశమయ్యారు. అనంతరం గండ్ర జ్యోతి మీడియాతో మాట్లాడుతూ పరకాల టికెట్ ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న వ్యక్తికి పరకాల టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరా అని జ్యోతి ప్రశ్నించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp president chandrababu fire on ys jagan
Getting more sleep at night may help you keep slim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles