Ys jagan tirumala visit turns controversial

Controversy, over, Jagan, visits, Tirumala,Love Controversy in Tirumala Love Controversy in Tirumala, Tirumala, Former TTD Chairman Karunakar Reddy, Jagan's signature controversy

Jagan Tirumala visit turns controversial.

YS Jagan Tirumala visit turns controversial.GIF

Posted: 05/02/2012 03:36 PM IST
Ys jagan tirumala visit turns controversial

YS-Jaganవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి ద్వారా ఆయన బుధవారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.శ్రీవారిని దర్శించుకునేందుకు వైయస్ జగన్ మంగళవారం రాత్రి తిరుమలకు వచ్చారు. ఆయన శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేశారు. జగన్‌తో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జగన్‌తో పాటు వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.

జగన్ తిరుమలను సందర్శించినప్పుడు టిటిడి సిబ్బంది హిందు మతాన్ని విశ్వసిస్తానని లిఖితపూర్వకండా ఉండే డిక్లరేషన్ పై సంతకం చేయవలసిందిగా కోరారు. దానిని జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు. జగన్ క్రిస్టియన్ కనుక సంతకం చేయాలన్నది కొందరి వాదన. అన్యమతస్తులు ఎవరైనా దీనిపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ వ్యూహాత్మకంగానే దానిని అంగీకరించలేదా? లేక మరేదైనా కారణం ఉందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఆ మధ్యన టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఒక విమర్శ చేస్తూ జగన్ నాస్తికుడని,ఇంతవరకు తిరుమల సందర్శించలేదని, టిటిడి మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి నాస్తికుడని, ఆ పార్టీకి ఓటు వేస్తు తిరుమలను పాడు చేస్తారని విమర్శించారు.కాని  కానీ దీని పై సాక్షి పత్రిక గతంలో కూడా జగన్ దైవ దర్శనం చేసుకున్నట్లు ఫోటో ప్రచురించింది. జగన్ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mens become a fair
Vijay sai will come into politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles