Mens become a fair

Mens Become a Fair.GIF

Posted: 05/02/2012 06:52 PM IST
Mens become a fair

Very-handsomeఈ భూమిమీద ఉన్న మనుషుల్లో మహిళలే చాలా అందంగా ఉంటారని తెలుసు. పురుషులు అంత అందంగా ఉండరని మనకు తెలిసిన విషయం. కానీ మానవజాతిలో పురుషులు నానాటికీ ఆకర్షణీయంగా రూపొందుతున్నారని తాజా పరిశోధన వెల్లడించింది. సృష్టిలో పక్షులు (కోడిపుంజు, నెమలి), జంతువులు (సింహం, ఎద్దు, పొట్టేలు), కొన్నిరకాల కీటకాలు... చక్కదనమంతా మగజాతిలోనే కనిపిస్తుంది.

ప్రసిద్ధ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సూత్రీకరించిన 'సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్' (మనగలిగితేనే మనుగడ)ద్వారా ఇది రుజువవుతోందని, ఆధునిక యుగంలోనూ ఇది కొనసాగుతున్నదని ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మానవ పరిణామం 'వేట-సేకరణ' కాలం నుంచి వ్యవసాయం, పెళ్లివంటి పద్ధతులు, సామాజిక కట్టుబాట్లవైపు సాగినా 'నేచురల్ సెలెక్షన్' (ప్రకృతి ఎంపిక)ను మందగింపజేయలేదని తెలిపింది.

చక్కటి రూపం, మేధస్సు వంటి లక్షణాలను సంతరించుకోవడం ద్వారా 'సంభోగ సాఫల్య' శాతాన్ని పెంచుకునే దిశగా పురుషులు పరిణామం చెందుతున్నట్లు పేర్కొంది. ఎలాగంటే... 'ఒకరికన్నా ఎక్కువ భాగస్వాములతో కలయిక వల్ల పురుషుడి పునరుత్పత్తి సాఫల్య అవకాశాలు మెరుగుపడతాయి. కానీ, స్త్రీలలో ఇది సాధ్యం కాదు' అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ విర్పి లుమా స్పష్టం చేశారు.

షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో జంతు, వృక్షశాస్త్ర విభాగం శాస్త్రవేత్త అయిన ఆమె ఇంకా ఏం చెప్పారంటే... "వ్యవసాయం, ఏక పత్నీవ్రతం వంటివాటితో మానవ పరిణామక్రమం ఆగిపోయిందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. కానీ, ఫిన్లాండ్‌లో 1760-1849 మధ్య జన్మించిన 6 వేల మందికి సంబంధించిన చర్చి రికార్డులను మేం పరిశీలించినపుడు అది అపోహేనని స్పష్టమైంది. ఎదుగుదలదాకా జీవనం, భాగస్వామి అందుబాటు, సంభోగ సాఫల్యం-పునరుత్పత్తి... ఈ నాలుగూ ప్రకృతి ఎంపికను నిర్దేశించే కీలకాంశాలు. వీటిని నిర్ధారించడానికి ఆరువేల మంది ఆర్థికస్థాయి, జనన మరణాలు, పెళ్లిళ్ల చరిత్రను అధ్యయనం చేశాం. తద్వారా ప్రాణికోటిలో నేటికీ సాగుతున్న నిరంతర పరిణామం మానవుల్లోనూ ప్రస్ఫుటమైంది'' అన్నారు. కాకపోతే ప్రకృతి ఎంపికతోపాటు లైం గిక ఎంపిక కూడా మానవుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Online examination also for em cet
Ys jagan tirumala visit turns controversial  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles