Telangana jac blame renuka chowdary

telangana jac blame renuka chowdary

telangana jac blame renuka chowdary

23.gif

Posted: 05/01/2012 07:14 PM IST
Telangana jac blame renuka chowdary

        రేణుకాచౌదరి ఒక దొరసాని.. ఆమెకు సామాన్యుల గురించి తెలియదని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ధ్వజమెత్తింది. ఇప్పటికి కూడా సీమాంధ్ర ప్రతినిధిగానే రేణుకాచౌదరిని చూస్తున్నామని జేఏసీ స్పష్టం చేసింది. తాను సీమాంధ్ర ప్రతినిధి కాదు అని నిరూపించుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో చిత్తశుద్ధితో పనిచేయాలని జేఏసీ సూచించింది. renuఅయితే మీడియాలో వస్తున్న విధంగా జేఏసీలో విభేదాలు లేవని స్పష్టం చేసింది.  విభేదాలు రావాలి... జేఏసీ విడిపోవాలని ఆంధ్రా పాలకులు కోరుకుంటున్నారని.. కానీ అది జరగని పని అని జేఏసీ తెలిపింది. తెలంగాణ ఎంపీలపట్ల కామెంట్స్‌ చేస్తున్న పాల్వాయి, రేణుక వారి పద్దతి మార్చుకోవాలని, లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని జేఏసీ చైర్మెన్‌ కోదండరాం హెచ్చరించారు.
       జేఏసీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలున్నాయన్నది తప్పుడు ప్రచారమేనని టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అభిప్రాయ బేధాలను తీవ్రం చేసి చూపడం సరికాదని ఆయన హితవు పలికారు.kodan పరకాల ఉప ఎన్నికలలో వివిధ జేఏసీలు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతున్నాయని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ వ్యవహారం ముస్లింల మనోభావాలు దెబ్బతీసిందని ఆయన అన్నారు. సంకుచిత రాజకీయాలు చేస్తున్న బీజేపీ విషయంలో జేఏసీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
      అయితే పరకాలలో పోటీచేస్తోన్న జగన్ పార్టీ నేత సురేఖ కేసీఆర్ మీద మండిపడుతున్నారు.  పరకాలలో టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ  వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెబుతున్నారని, తెలంగాణ ఎలా వస్తుందో చెబితే తాను పరకాల పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమని కొండా సురేఖ స్పష్టం చేశారు.konda తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న ఎంతమంది అమరవీరుల కుటుంబాలను టీఆర్ఎస్ ఆదుకుందో చెప్పాలని ఆమె కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. కెసిఆర్‌ అక్రమాల చిట్టా తాను త్వరలో బయటపెడతానని కొండా సురేఖ అన్నారు.  జేఏసీ నుంచి కోదండరామ్ ను బయటకు పంపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించారు. తనకు అడ్డొచ్చిన వారిని భ్రష్టుపట్టించడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Azad in cm kiran kumar reddy seat
New zealand mayor sets longest interview record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles