New zealand mayor sets longest interview record

Amid pontificating about the value of public speaking, Invercargill Mayor Tim Shadbolt today smashed the record for the world's longest television interview - and had to be cut off at the end

New Zealand mayor sets longest interview record.gif

Posted: 05/01/2012 05:07 PM IST
New zealand mayor sets longest interview record

Mayor-Tim-Shadboltఒక మేయర్ సరికొత్త రికార్డు సృష్టించారు. రికార్డు అంటే మామూలు రికార్డు కాదు గిన్నిస్‌ రికార్డు. నాయకులనగానే గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం, రోజుల తరబడి పాదయాత్రలు చేయడం వంటి పనులు చేసి రికార్డులు సృష్టిస్తారు. కాని న్యూజిలాండ్‌లో ఇన్‌వర్‌కార్గిల్ పట్టణ మేయర్ టిమ్ షాబోల్ట్ 26 గంటల టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి గిన్నిస్ రికార్డు సాధించాడు. 'న్యూస్‌టాక్ జెడ్‌బి' టీవీ మేయర్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇంతకీ ఆ మేయర్‌ని అన్ని గంటలు మాట్లాడించిన అంశమేమిటంటారా? అక్కడి పట్టణాల్లో సెయింట్ జాన్ అంబులెన్సులు ఎదుర్కొంటున్న నిధులకొరత.

రోజురోజుకీ పెరుగుతున్న అంబులెన్సుల అవసరం, ప్రాథమిక చికిత్సలకు కావాల్సిన పరికాల కొరత, వైద్య సదుపాయాలు, ఔషధాల గురించి గంటల తరబడి చెప్పుకొచ్చారాయన. ఆయన మాట్లాడిన అంశం సంగతి పక్కన పెట్టి రికార్డు గురించి చెప్పాలంటే 2009లో స్పెయిన్‌లో ఒక నాయకుడు 12 గంటల 30 నిమిషాల నిర్విరామ ఇంటర్వ్యూ ఇచ్చి రికార్డు సృష్టించాడు. అతని రికార్డుని షాబోల్ట్ బ్రేక్ చేశాడు. ప్రజల అవసరాల గురించి ఓ అరగంట మాట్లాడ్డానికే ఆయాసపడే నాయకులు షాబోల్ట్‌ని ఆదర్శంగా తీసుకుంటే మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana jac blame renuka chowdary
Tdp leader chandra babu naidu anantapur election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles