News reporter listed among worst jobs

software engineer’s job is the best,Reporter’s job,job ranking

A reporter job figures among the ten worst professions, alongside the likes of butchers, waiters and dishwashers, as per a new study by the US-based consultancy CareerCast, which has named a software engineer’s occupation as the best for the year 2012.

News reporter listed among worst jobs.gif

Posted: 04/13/2012 01:04 PM IST
News reporter listed among worst jobs

Worst-jobమన దేశంలో శ్రమకు గుర్తింపు లేదని మరోసారి రుజువయ్యింది. ఎంతో కష్టపడి ప్రజలకు నిత్యం సమాచారం అందిస్తూ ఉన్న వార్తా రిపోర్టర్ల ఉద్యోగం చెత్త ఉద్యోగం తేల్చింది. ఏ రాజకీయ నాయకుడైనా, సెలబ్రటీ అయినా వస్తున్నాడంటే వారి కోసం కళ్ళు కాయలు కాసేలా చూసి, వారు వచ్చిన తరువాత ఒకటో రెండో ప్రశ్నలు అడిగి తెలుసుకొని వాటిని ప్రజలకు చేరే వేరే విలేఖరి ఉద్యోగానికి విలువ లేదని తేల్చింది.

అమెరికాకు చెందిన కెరీర్ కాస్ట్ అనే కన్సల్టెన్సీ సంస్థ.. టాప్ టెన్ అతి చెత్త ఉద్యోగాల జాబితాలో రిపోర్టర్ ఉద్యోగానికి ఐదో స్థానం ఇచ్చింది. ఈ 'చెత్త ఉద్యోగాల జాబితా'లో రిపోర్టర్లకు అటూ ఇటూ ఉన్నది రెస్టారెంట్‌లో వెయిటర్లు, అంట్లు తోమేవాళ్లు, మాంసం కొట్టేవాళ్లు, చెట్లు కొట్టేవాళ్లు, ఆయిల్ రిగ్గుల్లో కార్మికులు. ఆ సంస్థ విడుదల చేసింది చెత్త ఉద్యోగాల చిట్టా మాత్రమే కాదు. 2012 సంవత్సరానికిగాను, 200 ఉద్యోగాలకు అత్యుత్తమం నుంచి అతిచెత్త దాకా రేటింగ్ ఇచ్చింది.

యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు..ఆయా ఉద్యోగాలకు అవసరమయ్యే శారీరక శ్రమ, పనిచేసే వాతావరణం, ఆదాయం, ఒత్తిడి తదితరఅంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేటింగ్ ఇచ్చింది. ఇందులో టాప్ 1.. అనగా, అత్యుత్తమ ఉద్యోగం ఏంటో తెలుసా? సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ ఉద్యోగం. ఏడాదికి రూ.40 లక్షల దాకా జీతం(ఇది యూఎస్ ప్రమాణాల ప్రకారం), తక్కువ శారీరక శ్రమ, ఒత్తిడి కూడా తక్కువే ఉండటం ఈ ఉద్యోగల్లో ఉండే మంచి లక్షణాలట. ఇంటర్‌నెట్‌లో సమాచారం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుండటంతో.. పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు క్రమేపీ ఆదరణ తగ్గుతోంది. నిజానికి ఈ రెండు రంగాల్లో ఉద్యోగం అంటే ఒకప్పుడు బాగా క్రేజ్ ఉండేది. కానీ.. రిపోర్టర్ ఉద్యోగంలో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న అవకాశాలు, తక్కువ ఆదాయం వంటివి దీన్ని చెత్త ఉద్యోగాల జాబితాలోకి చేర్చాయని కెరీర్ కాస్ట్ తన నివేదికలో పేర్కొంది.

ఇక, అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాల జాబితా ఇది... సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, విమాన చోదకుడు, మిలటరీ అధికారి, పోలీస్ అధికారి, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ప్రజా సంబంధాల అధికారులు, సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, ఫొటో జర్నలిస్టులు, టాక్సీ డ్రైవర్లు. టాప్ టెన్ బెస్ట్ ఉద్యోగాలు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బీమా నిపుణులు, హెచ్ఆర్ మేనేజర్, దంత వైద్యులు, ఫైనాన్షియల్ ప్లానర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandeswari respond on ysr schemes
Tara alleges sexual harassment by cop  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles