Purandeswari respond on ysr schemes

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Purandeswari Respond on YSR Schemes.

Purandeswari Respond on YSR Schemes.GIF

Posted: 04/13/2012 01:11 PM IST
Purandeswari respond on ysr schemes

Daggubatiదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై కాంగ్రెస్ లో కొందరు జై కొడుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన పై విరుచుకు పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన వర్గం వాళ్ళు వైయస్ కాంగ్రెస్ వాడేనని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తెచ్చాయని అంటుంటే... బొత్సా వర్గం, కిరణ్ వ్యతిరేక వర్గం డీఎల్ వంటి వాళ్ళు మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతి కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వైయస్ ప్రవేశ పెట్టినవి కాదని,మేం చెబితే అమ్మ అనుమతితో ప్రవేశ పెట్టాడని అంటున్నారు.

తాజాగా ఎన్టీఆర్ కుమార్తె,  కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా వైయస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 2004 నుంచి అమలు చేసిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలేనని, వైయస్ పథకాలు కావని, పథకాల అమలుకు నిధులు ఇచ్చింది ప్రభుత్వమే తప్ప ఎవరూ సొంత డబ్బులు పెట్టలేదని, కాబట్టి అవి ప్రభుత్వ పథకాలే అవుతాయని స్పష్టం చేశారు. వైఎస్‌పై కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని, వాటిపై తాను స్పందించబోనని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T subbarami reddy
News reporter listed among worst jobs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles