Tara alleges sexual harassment by cop

Tara alleges sexual harassment by cop, Tollywood actress Tara Chowdary, who was arrested on the charges of forcing a woman into prostitution,

Tara alleges sexual harassment by cop

Chowdary01.gif

Posted: 04/13/2012 12:39 PM IST
Tara alleges sexual harassment by cop

Tara-Chowdary1

‘‘మనం మనం ఒక కులం.. కన్నా లక్ష్మీనారాయణ కాపు.. ఆయనపై దుష్ప్రచారం చేయాలి’’అని చెప్పినట్టు వివరించింది. అలా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ప్రలోభ పెట్టాడని తెలిపింది. తారాచౌదరి ఉదంతం సంచలనాత్మక మలుపు తిరిగింది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మీడియా ఎదుట చెడుగా ప్రచారం చేయాలంటూ తనపై గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒత్తిడి తెచ్చినట్టు తారాచౌదరి వెల్లడించింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో రాయపాటి, ఆయన తమ్ముని కుమారుడు తనను తుపాకులతో బెదిరించారని పేర్కొంది. స్వయంగా తారాచౌదరి వెల్లడించిన ఈ వివరాలతో కేసు ముందు ముందు ఊహించని మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే తారాచౌదరి మాటలను రాయపాటి ఖండించారు. అవన్నీ అబద్ధాలని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణను దెబ్బతీసేందుకు తారాచౌదరిని ప్రయోగించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఆమె చెప్పినవన్నీ నిజాలని నిరూపిస్తే కోటి రూపాయలిస్తానని సవాల్ విసిరారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజానిజాలు వెలుగులోకొస్తాయన్నారు. ఉద్యోగాల ఎర చూపించి అమాయక యువతులను వ్యభిచార రొంపిలోకి దింపుతోందన్న ఆరోపణలపై ఇటీవల బంజారాహిల్స్ పోలీసులు తారాచౌదరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో తారాచౌదరి నివాసంలో సోదాలు జరిపినపుడు బెడ్‌రూముల్లో స్పై కెమెరాలతోపాటు తొంభై వీడియో, ఆడియో సీడీలు దొరికాయి. వీటిల్లో కొంతమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, సంపన్న కుటుంబాలకు చెందిన యువకుల రాసలీలలు, సంభాషణలు రికార్డయి ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని తారాచౌదరి పలువురిని బ్లాక్‌మెయిల్ చేసినట్టుగా అనుమానాలు ఉండటంతో బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజులపాటు ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  News reporter listed among worst jobs
What will happens behind kcrs silent movement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles