Police arrest stuvartupuram thief maharaj1

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

police arrest Stuvartupuram thief Maharaj. Police are searching for Maharaj from thirteen years. His own village stuvartupuram of Guntur distict

police arrest Stuvartupuram thief Maharaj.gif

Posted: 04/12/2012 03:25 PM IST
Police arrest stuvartupuram thief maharaj1

అతడు మామూలు చిల్లర దొంగ.. కానీ విలాసవంతమైన ప్రయాణాలు...ఖరీదైన భవంతులు సంపాదించాడు. అలాంటి దొంగ గత 13 సంవత్సరాల నుండి పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తూ తప్పించుకొని తిరుగుతున్న స్టువర్టుపురం దొంగ మహరాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఒక్క మన రాష్ట్రానికి చెందిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా ఐదు రాష్ట్రాల వాళ్ళతో ఆడుకున్న ఇతన్ని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా స్టువర్టుపురానికి చెందిన మహరాజ్ అసలు పేరు మేండ్రగుట్టి విజయ్‌ కుమార్.  చిల్లర దొంగగా ఈయన తన ప్రస్థానం ఆరంభించాడు. కానీ ఆ తర్వాత క్రమంగా కోట్లకు పడగలెత్తాడు. అతనికి స్టువర్టుపురంలో కోట్ల ఖరీదు చేసే నాలు గంతస్తుల భవనం ఉందట. మహరాజ్ ఏర్పాటు చేసిన ముఠా ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలను కొల్లగొట్టింది.

తరచూ వేషధారణ మారుస్తూ రైలు ఎసి బోగీల్లో లేదంటే విమానాల్లోనే తిరుగుతుండటం మహరాజ్ స్టైలంట. చివరకు పది రోజుల క్రితం తిరుపతి క్రైం బ్రాంచి పోలీసులకు అనూహ్యంగా చిక్కాడు. మహరాజ్‌కు బంధువయ్యే ఉత్తం అలియాస్ పాలడబ్బా ద్వారా తిరుపతి పోలీసులు వల పన్ని పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.ఇప్పటి వరకు మహరాజ్ నుంచి సుమారు 7, 8 కిలోల బంగారం రికవరీ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా స్టువర్టుపురం, చీరాల ప్రాంతాల్లో పోలీసులు ఇదే పనిలో ఉన్నారట. పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే 50 కిలోలకు పైగా బంగారంతో పాటు పెద్ద మొత్తంలో ఆస్తులు రికవరీ అవుతాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana congress leaders go to delhi
C upholds constitutional validity of right to education act  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles