Central varsities may be allowed to start constituent colleges

Central varsities may be allowed to start constituent colleges,Andhra Pradesh,Hyderabad,English and Foreign Languages University, UGC schemes

Central varsities may be allowed to start constituent colleges

Central.gif

Posted: 04/10/2012 04:31 PM IST
Central varsities may be allowed to start constituent colleges

Central varsities may be allowed to start constituent colleges

ప్రస్తుతం దేశంలో 611 విశ్వవిద్యాలయాలు ఉండగా రానున్న ఐదేళ్లలో వాటి సంఖ్యను 1600లకు పెంచాలని భావిస్తున్నామన్నారు ఉన్నత విద్యా రంగ అభివృద్ధి, విస్తరణ కోసం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) భారీ ప్రణాళికలు రూపొందించింది. ముందెన్నడూ లేని విధంగా వచ్చే ఐదేళ్లకుగాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.84లక్షల కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. రానున్న ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 20 మహిళా విశ్వవిద్యాలయాలు, 14 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, 374 మోడల్ డిగ్రీ కాలేజీలు, 1000 పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌లో యూజీసీ మెంబర్ ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలతో ముందుకు వస్తే రాష్ట్రానికి మరో కొత్త మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యూజీసీ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతిపాదన వస్తే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కూడా రానుందన్నారు. రాష్ట్రంలో 20 మోడల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 26న జరిగే యూజీసీ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 12వ ప్రణాళిక పూర్తయ్యే నాటికి 25 నుంచి 30 శాతానికి పెంచాలని యూజీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళల్లో ఉన్నత విద్యను పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని, ఇందుకు అన్ని విధాలా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.

అమెరికాలో 3600 వర్సిటీలు, జపాన్‌లో 2600 వర్సిటీలు, చైనాలో 2800 వర్సిటీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న అఫిలియేషన్ సిస్టంలోనూ మార్పులు తీసుకువస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 3 వేల అటానమస్ కాలేజీలు వస్తాయని తెలిపారు. కోర్టు కేసు ఓ కొలిక్కి వస్తే రాష్ట్రానికి మరో 20 కొత్త డీమ్డ్ వర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sony pictures to pick up 30 stake in maa tv
Film industry seeks bharat ratna for anr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles