Sony pictures to pick up 30 stake in maa tv

Sony Pictures to pick up 30% stake in MAA TVIndia,Andhra Pradesh,arts, culture and entertainment,culture (general),company information,alliance and joint venture,mass media,radio, tv,media,cinema industry,MAA Television, Sony Pictures Television, alliance, stake,

Sony Pictures to pick up 30% stake in MAA TV

MAA TV.gif

Posted: 04/10/2012 04:37 PM IST
Sony pictures to pick up 30 stake in maa tv

Sony Pictures to pick up 30 persent  stake in MAA TV

ఈ పరిణామంతో తెలుగు టెలివిజన్ రంగంలో మా టీవీ కొత్త కక్ష్యలోకి అడుగుపెట్టినట్టవుతుందని వారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాటీవీలో మొత్తం నాలుగు చానెల్స్ ఉన్నాయి. తొలి ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్ 2002లో ప్రారంభం కాగా ఆ తర్వాత 2008లో మా మ్యూజిక్, గత ఏడాది మా మూవీస్, ఈ ఏడాది మా గోల్డ్ పేరుతో ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లను ప్రారంభించారు.

తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ చానెళ్లను నిర్వహిస్తున్న మా టీవీలో 30 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సోనీ పిక్చర్స్ టెలివిజన్ (ఎస్‌పిటి) నిర్ణయించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. 30 శాతం వాటాకు సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఎంత చెల్లిస్తుందనే విషయం మాత్రం స్పష్టం కాలేదు.

మా టీవీ విలువ మదింపు వేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలిసింది. ఏ ప్రమాణాల ఆధారంగా విలువను లెక్కించాలనే అంశంపై మాత్రం రెండు సంస్థలు అవగాహనకు వచ్చాయి. పదేళ్ల క్రితం ప్రారంభమై అంచెలంచెలుగా విస్తరించిన మా టీవీ చానెల్స్ నెట్‌వర్క్‌లో నిమ్మగడ్డ (మాట్రిక్స్) ప్రసాద్ మెజార్టీ షేర్‌హోల్డర్ కాగా ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఆయన బంధువు అల్లు అరవింద్, మరో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇతర వాటాదాలుగా ఉన్నారు.

ఈ నలుగురి ఉమ్మడి వాటా 95 శాతం కాగా అందులో ప్రసాద్ వాటానే 60 శాతంపైగా ఉన్నట్టు తెలిసింది. సోనీ టెలివిజన్ కొనుగోలు చేస్తున్న 30 శాతం వాటాలో కొంతభాగాన్ని ప్రస్తుత వాటాదారులు విక్రయిస్తారు. ఇది కాకుండా కంపెనీ నిధుల అవసరాల కోసం మరికొంత తాజా ఈక్విటీని జారీ చేస్తారని తెలిసింది. ఈ డీల్ కొలిక్కివస్తే, మా టెలివిజన్ ఈక్విటీలో ప్రసాద్ తర్వాత రెండో అతిపెద్ద వాటాదారుగా సోనీ పిక్చర్స్ ఉంటుంది.
సోనీ - మా టీవీ భాగస్వామ్యం ఉభయకంపెనీలతో పాటు ప్రేక్షకులకూ లాభదాయకమని సోనీ పిక్చర్స్ ప్రతినిధి మంజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ రంగంలో మా టీవీ స్థాయి, స్థానంపై సోనీ టెలివిజన్‌కు ఉన్న విశ్వాసానికి ఇది తార్కారణని మా టెలివిజన్ చానెల్స్ చైర్మన్ ఎన్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సోనీ వ్యూహాత్మక భాగస్వామిగా చేరుతున్నందున మా ప్రేక్షకులకు రానున్న రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన కార్యక్రమాలు అందుతాయని ఆయన చెప్పారు. సోనీ నిర్ణయం పట్ల మా టీవీ మరో ఇద్దరు ప్రమోటర్లు చిరంజీవి, నాగార్జునా కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా తెలుగు టెలివిజన్ చానెళ్ల యాజమాన్య వ్యవహారాల్లో ఇటీవల కాలంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. యాజమాన్యం తెలుగువారి నుంచి బయటవారికి పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈటీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లను ఇప్పటికే నెట్‌వర్క్ 18 గ్రూప్ కొనేసింది. ఇప్పు డు మా టీవీలో 30 శాతం వాటా సోనీ పరం అవుతోంది. ఈ రెండు చానెళ్లు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రస్థానంలోనే ఉన్నాయి. వీటితో పాటు అగ్రభాగన ఉన్న మరో రెండు సంస్థలు జెమిని, జీ టీవీ ఎటూ తెలుగువారి సంస్థలు కావు. ఇకపోతే కొన్ని న్యూస్ చానెళ్లు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. రెండు మూడు ఛానెల్స్ పూర్తి డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కొత్తంగా మరో రెండు మూడు చానెళ్లకు సన్నాహాలు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Praja santhi party leader mr ka paul
Central varsities may be allowed to start constituent colleges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles