Overtime fitness

Overtime Fitness,Overtime Gym,

Overtime Fitness

Overtime.gif

Posted: 04/04/2012 10:23 AM IST
Overtime fitness

Overtime Fitness

ఎంతసేపు వ్యాయామం చేశామన్నది ముఖ్యంకాదు ఎంత కఠోరంగా చేశామన్నదే ముఖ్యం అంటున్నారు పరిశోధకులు. శరీరంలో కేలరీల ఖర్చు వ్యాయామం చేసిన సమయంపై ఆధారపడదని వారు వెల్లడించారు. గంటలతరబడి జిమ్‌లో గడపనవసరం లేదని తెలిపారు. ఎక్కువసేపు వ్యాయామం చేసిన దానికి తక్కువ సమయం వ్యాయామం చేసినదానికి పెద్ద తేడా ఏమీ లేదని తేల్చి చెప్పారు. అయితే తక్కువ సమయం వ్యాయాయం చేసేవారు మరింత కఠోర వ్యాయామం చేయాలని వివరించారు. కెనడాలోని ఒంటారియోలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.

Overtime Fitness

తక్కువ సమయం వ్యాయామం చేసినా తీవ్రంగా చేస్తే.. శరీరంలో మెటబాలిక్ సిండ్రోమ్ పెరిగే అవకాశం మూడింట రెండు వంతులు తగ్గుతుందని తెలిపారు. నడక తదితర వ్యాయామాలు ఎక్కువ సమయం చేయడంకంటే పరుగు, స్కిప్పింగ్ తదితర వ్యాయామాలు తక్కువ సమయం చేసినా చాలని వెల్లడించారు. సుమారు గంటా పదిహేను నిమిషాలు కఠిన వ్యాయాయం చేసినవారి కంటే.. రెండున్నర గంటలు సాధారణ వ్యాయామం చేసినవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం 2.4 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం దాదాపు 1000 మందిని పరీక్షించి ఈ నివేదిక సమర్పిస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  James cameron reshot titanic 3d scene
Botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles