Mother son reunite after 24 years

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Mother, Son Reunite After 24 Years.GIF

Posted: 03/26/2012 07:14 PM IST
Mother son reunite after 24 years

Mother_and_sonదేవుడు మన విధి ఎలా రాస్తాడో అలానే జరుగుతుంది. కొందరికి కన్న ప్రేమను శాశ్వతంగా దూరం చేస్తే, మరికొందరిని మాత్రం దగ్గర చేస్తుంది. అలాంటి సంఘటనే ఇది. ఖాండ్వాకు చెందిన షేరు (ప్రస్తుత పేరు షారు బ్రాలి) 1988లో తన ఆరేళ్ల వయస్సులో తప్పిపోయాడు. రైళ్లలో టీ అమ్మి పొట్టపోసుకునే తన సోదరులు గుడ్డు, కల్లు(సలీం)లతో కలిసి షేరు నిత్యం బుర్హాన్‌పూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేవాడు. ఒకరోజు బుర్హాన్‌పూర్ నుంచి పెద్ద సోదరుడు గుడ్డుతో కలిసి రైలులో ఇంటికి తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తూ గుడ్డు రైలు నుంచి కింద పడిపోయాడు. ఆ సమయంలో నిద్రలో ఉన్న షేరు ఖాండ్వాలో దిగకుండా రైలులో కోల్‌కతా చేరుకున్నాడు. అనంతరం అక్కడి ఓ బిచ్చగాళ్ల ముఠా షేరును తమ సభ్యుడిగా చేర్చుకుంది. అక్కడి నుంచి తప్పించుకున్న షేరు అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థలో చేరాడు. ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు షేరును దత్తత తీసుకుని తమ వెంట తీసుకెళ్లారు.

అతడి పేరుని షారు బ్రాలిగా మార్చారు.ప్రస్తుతం షారు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుని, తన కుటుంబానికి చెందిన వ్యాపారంలో స్థిరపడ్డాడు. అయితే, చిన్నప్పుడు తన సోదరులు, అక్కలతో కలిసి తీసుకున్న ఫొటో అతడి గతాన్ని ఎప్పుడూ గుర్తుచేస్తు ఉండేది. అప్పట్లో తాను తప్పిపోయిన రైల్వే స్టేషన్ పేరు బ్రహ్మపూర్‌గా గుర్తుకువచ్చి ఇంటర్‌నెట్‌లో తెగ వెతికేవాడు. చివరికి ఆ ఊరు బ్రహ్మపూర్ కాదని, బుర్హాన్‌పూర్‌గా గూగుల్, ఫేస్‌బుక్ సాయంతో కనుగొన్నాడు. చిన్ననాటి ఫొటో సాయంతో ఫిబ్రవరి 12న భారత్‌కు వచ్చి తనవారిని కలిశాడు. కుటుంబ సభ్యులు షేరును చూసి షాక్‌కు గురై.. క న్నీరుమున్నీరయ్యారు. షేరు తల్లి ఫాతిమా ఆనందాన్ని వర్ణించడానికైతే మాటలు చాలవు. కొద్దిరోజులపాటు ఇక్కడే ఉన్న షేరు అనంతరం ఆస్ట్రేలియా వెళ్లాడు. తమ జీవితాల్ని మారుస్తానని షేరు మాటిచ్చినట్లు అతడి సోదరుడు కల్లు మీడియాతో చెప్పాడు.

ఇక్కడ విధి విచిత్రమేంటంటే... పాతికేళ్ల తర్వాత కనిపించిన కొడుకుతో తనివితీరా ఊసులు పంచుకోలేని పరిస్థితి షేరు తల్లిది.. ఎందుకంటే, ఆమెకు ఇంగ్లీషు రాదు, ఆస్ట్రేలియాలో పెరిగిన షేరు హిందీ పూర్తిగా మరచిపోయాడు. రోజుల వ్యవధిలోనే ఆమె ఇంగ్లీషులో కొన్ని పదాలు నేర్చుకొని, షేరుకి ఆశ్రయం కల్పించి, జీవితాన్నిచ్చిన ఆస్ట్రేలియా దంపతులకు కృతజ్ఞతలు చెబుతూ పలుకుతున్న పదమిదే...‘థ్యాంక్యూ సోమచ్ ఫర్ న్యూ లైఫ్ యూ గివెన్ టు మై సన్..’ ఈ స్టోరీ చదివితన తరువాత మీకు ఓ సినిమా స్టోరి గుర్తొస్తుంది కదూ....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana bandh
Two persons were killed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles