Rail budget 2012

Rail Budget 2012,ompany information,new project,economy (general),Railway Budget,transport and logistics,railway,railway projectRailway minister Dinesh Trivedi

Rail Budget 2012

Rail.gif

Posted: 03/15/2012 11:04 AM IST
Rail budget 2012

Rail Budget 2012

రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు యధా ప్రకారం అన్యాయమే జరిగింది. పెద్దరాష్ట్రం, అధిక ఆదాయం తీసుకొచ్చే దక్షిణమధ్య రైల్వే మన రాష్ట్రంలో వుంది. అయినా ఎప్పుడూ ఎపిపై శీత కన్ను వేస్తూనే వున్నారు. ఒకటీ, అరా రైళ్ళు లేదా ప్రాజెక్టులు ప్రకటించి కంటినీరు తుడిచారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంలోనే జాప్యం చేసిన కిరణ్‌ ప్రభుత్వం ఇప్పుడు కొన్నింటి నైనా మంజూరు చేసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మొత్తంమీద రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రప్రభుత్వం సహకారం అంది స్తామంటే తూతూమంత్రంగా కొన్ని ప్రాజెక్టులు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడ- పిఠాపురం రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేమంత్రి దినేష్‌ త్రివేది వెల్లడించారు. 2012-13 కుగాను రైల్వేబడ్జెట్‌ ప్రతిప్రాదనలు చేస్తూ కాకినాడ-విశాఖపట్నం మధ్య కోస్టల్‌ రైల్వే కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు భూమి, తగు నిధులు సమకూర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముం దుకు వచ్చిందని మంత్రి వెల్లడించారు.

మెదక్‌- అక్కన్నపేట, భద్రాచలం-కొవ్వూరు మధ్య లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఎంఎంటిసి రెండవ దశ నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రానికి కొన్ని కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు చేశారు. బనగానపల్లి-నంద్యాల, కడప-గంగన పల్లి, రాయదుర్గం-ఆవులదర్గా, కదిరి-పుట్టపర్తి, శ్రీనివాసపురం-మదనపల్లి, చిక్‌బళ్ళాపూర్‌- పుట్ట పర్తి, జహీరాబాద్‌-సికింద్రాబాద్‌ లైన్లను ప్రతి పాదించారు. రాష్ట్రంలో ఐదు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటిం చారు. అందులో సత్తెనపల్లి, వినుకొండ, దువ్వాడ, మాచర్ల, పిడుగురాళ్ళ స్టేషన్లు వున్నాయి. కాజీ పేట-విజయవాడ మూడో లైనును అనుమతి లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trscong colluded to get me jailed
Kalvakuntla chandrashekar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles