Kalvakuntla chandrashekar rao

Kalvakuntla Chandrashekar Rao,Kcr, Photos - Kcr, Videos - Kc, Mahaboobnagar, by election, nagarkarnool, people, Roadshow, Chandrababu, Assembly, CM Kiran kumar Reddy, parliament, Kcr, Theif

Kalvakuntla Chandrashekar Rao

Kalvakuntla.gif

Posted: 03/15/2012 10:58 AM IST
Kalvakuntla chandrashekar rao

Kalvakuntla Chandrashekar Rao

తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న వారిలో బయటి వారికంటే ఇంటిదొంగలే అధికంగా వున్నారని, ప్రస్తుత ఎన్నికలలో అలాంటి దొంగలకు అవకాశాలు ఇవ్వకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణవాదం లేదని నిరూపించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి వారి ఎత్తుగడలు, కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం బిజినేపల్లి మండలంతోపాటు మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన రోడ్‌షోతో పాటు బహిరంగసభలలో ప్రసంగించారు. తెలంగాణ నిత్యం దోపిడీకి గురైనందునే ప్రజలు కులమతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చి పోరాటం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ జాగీరా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు టక్కుటమార విద్యను తెలంగాణ ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా టీడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని, లేదంటే తెలంగాణ ప్రజలు ఆయనను విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా వుందని, అదేనిజమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rail budget 2012
Cbi jd lakshmi narayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles