Mulayam singh yadav

Mulayam Singh Yadav,Samajwadi Party supremo Mulayam Singh Yadav,UP Polls, Polls 2012, UP, Rahul Gandhi, Congress, BJP, SP, BSP, Mulayam Singh Yadav, Mayawati, Akhilesh Yadav

Mulayam Singh Yadav

Mulayam.gif

Posted: 03/07/2012 11:48 AM IST
Mulayam singh yadav

Mulayam Singh Yadav

చచ్చిన మనిషిని మళ్లీ చంపడమెందుకు.. ఐదేళ్ల కిందట ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను ఉద్దేశించి అప్పట్లో ఘనవిజయం సాధించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్య ములాయంను తప్పకుండా వెంటాడి ఉంటుంది. అందుకే ఐదేళ్లు తిరిగేసరికి యూపీ పీఠాన్ని మళ్లీ చేజిక్కించుకొని ఆ వ్యాఖ్యలు చేసిన మాయావతిపై ములాయం బదులు తీర్చుకున్నారు. 39 ఏళ్ల వయసులో ములాయం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇంజినీర్ నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన ఆయన ఎస్పీని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా పటిష్టపరచడంలో తీవ్రంగా కష్టపడ్డారు. 1977, 0లో లోక్‌దళ్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తొలిసారి 199లో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత అక్టోబర్ 7, 1992న సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్, జనతాదళ్ మద్దతు మరోసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత కేంద్రమంవూతిగా పలు బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ 2003 ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత 2007 ఎన్నికల్లో అధికారంలోకి మాయావతి రావడంతో ములాయం పని అయిపోయిందనుకున్నారు. 72 ఏళ్ల వయసులోనూ పార్టీని నడిపించడంలో, జన సమీకరణలో ఆయన రాజకీయ చతురత అపారం. తనయుడు అఖిలేశ్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి సరైన నిర్ణయం తీసుకున్న ఆయన మరోసారి విజయంతో మళ్లీ సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విజయం తనొక్కడి క్రెడిట్ కాదని, పార్టీ కార్యకర్తలందరికీ ఇది వర్తిస్తుందని ఆయన విన్రమంగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mayawati quits as up cm
Cpi narayana comments condemned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles