Regency reopening is not possible says naidu

regency reopening is not possible says naidu,

naidu-1.gif

Posted: 03/06/2012 05:23 PM IST
Regency reopening is not possible says naidu

naiduయానాంలో ఈ మధ్యకాలంలో జరిగిన కార్కికుల ఆందోళన కారణంగా తీవ్రంగా నష్టపోయిన రీజెన్సీ పరిశ్రమను మళ్లీ తెరిచే ధైర్యం తనకు లేదంటూ ఆ పరిశ్రమ సిఎమ్ డి, జి ఎన్ నాయుడు అన్నారు. పరిశ్రమలో ఎంతో నష్టాన్ని చవిచూసి, మానసికంగా వ్యథకు లోనైన నాయుడు ఉద్యోగులుంటే కాలనీలో పర్యటించారు.

ఉద్యోగులంతా ఆయనతో చర్చలకు దిగి, తాము కష్టపడి పనిచేస్తామని, పరిశ్రమను ఎలాగైనా తిరిగి తెరిపించి పని ప్రారంభించమని కోరారు. అందుకు సమాధానంగా నాయుడు, తనకా ధైర్యం లేదని, తన తలకి కొరివి పెట్టటానికి అర్హుడైన తన కొడుకులా చూసుకున్న కెసి చంద్రశేఖర్ ని పోగొట్టుకున్నానని, అతని ఫొటో పక్కనే తన ఫొటో కూడా చూసుకోవటానికి మరోసారి పరిశ్రమని తెరవమంటారా అని అడిగారు నాయుడు.

ఒకపక్క పరిశ్రమ తగలబడుతుంటే దాన్ని గాలికి వదిలేసి అందినంత వరకూ దోచుకునిపోయారని, సీలింగ్ ఫాన్ లాగితే రాకపోతే విరగ్గొట్టుకుని మరీ తీసుకుపోయారని, నా సొంతవూరిలా భావించి యానాంలో సేవ చేస్తే చివరకు తనకు లభించింది చంద్రశేఖర్ మృతదేహమేనని తన ఆవేదనను వ్యక్తపరచారాయన. కనీసం సాక్ష్యం చెప్పటానికైనా ఎవరికైనా ముందుకు రానప్పుడు ఈ యానాంలో తను పరిశ్రమనెందుకు పెట్టాలని నాయుడు ప్రశ్నించారు.

ఎన్నో అడ్డంకులు వచ్చినా తట్టుకుని ఎవరి జీతభత్యాలు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఆపకుండా ముందుకు తీసికెళ్ళిన నాయుడు తన 72 సంవత్సరాల వయసులో ఇంతటి క్షోభని అనుభవిస్తూ తిరిగి పరిశ్రమను ప్రారంభించటమనేది ప్రశ్నార్థకమేనని అక్కడే ఉన్న డైరెక్టర్ సత్యేంద్ర కుమార్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganguly is fit to act as coach kapil dev says
Putin cried with pleasure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles