Jagan mlas resonse on disqualification

Jagan MLAs resonse on Disqualification.gif

Posted: 03/03/2012 06:50 PM IST
Jagan mlas resonse on disqualification

Jagan-teamరెండున్నర నెలలుగా కాంగ్రెస్ నాన్చుతూ వస్తున్న అంశానికి తెరదించింది. ఎట్టకేలకు జగన్ వర్గం ఎమ్మెల్యే పై వేటు వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలైన 16 మంది పై వేటు సభాపతి వేటు వేశారు.

అయితే స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల బండారాన్ని బట్టబయలు చేస్తామని అనర్హత వేటు పడిన జగన్ వర్గ ఎమ్మెల్యేలు తెలిపారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌తో సమావేశమయ్యారు. 2014లో జగన్ సీఎం కావడానికి ఈ ఉప ఎన్నికలు రిహార్సల్ అని వారు పేర్కొన్నారు. అన్ని ఉప ఎన్నికలు ఒకే సారి వచ్చి ఉంటే ప్రజలపై భారం తగ్గి ఉండేదన్నారు.

అయితే జగన్ వర్గ ఎమ్మెల్యేలు పైకి గెలుస్తామని భీరాలు పలుకుతున్నా... లోపల మాత్రం భయం పట్టుకుందని తెలుస్తుంది. ఇన్ని రోజులు అధిష్టానం వేటు వేయదని ధీమాగా ఉన్న ఈ వర్గానికి ఇప్పుడు టెన్షన్ మొదలయ్యింది. అసలే అవినీతి కుంభకోణాలు, సీబీఐ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో వేటు వేశారు. ఇలాంటి సమయంలో జనంలోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడిగితే వారు వేస్తారో వేయరో అని లోలోపల టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు జగన్ కి సపోర్ట్ ఇచ్చామా? రాక రాక పదవి వస్తే అది కాస్త మధ్యలోనే పోతే ఏం లాభం అని లోలోపల అనుకుంటున్నట్లు తెలుస్తుంది. 2014 వరకు కాంగ్రెస్ తోనే ఉండి తరువాత జగన్ వైపు వస్తే పోయేది... ఇప్పుడు గెలవక పోతే ఉన్నది, ఉంచుకున్నది కాస్త పోతుందనే టెన్షన్ పడుతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mayawati and elephant statues uncovered
Kingfisher airlines 40 bank account seized  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles