Waiting for capital punishment is every day torture

waiting for capital punishment is every day torture, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

waiting for capital punishment is every day torture, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

capital-punishment-1.gif

Posted: 02/22/2012 05:03 PM IST
Waiting for capital punishment is every day torture

supreme-court

మరణశిక్ష విధించిన వారి క్షమాభిక్ష అభ్యర్ధనలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చాలాకాలంగా పేరుకుపోయి ఉండటం మీద సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1993 సెప్టెంబర్ లో పంజాబ్ కి చెందిన దేవేందర్ పాల్ సింగ్ భుల్లర్, రైసినా రోడ్ లో బాంబు పేలుళ్ళకు పాల్పడ్డాడు. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేరానికి అతనికి మరణ శిక్షను విధించారు కానీ క్షమాభిక్ష పిటిషన్ చాలాకాలంగా పెండింగ్ లో ఉండటం వలన తన మీదున్న మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చమని సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ బాపతు విచారణలో సుప్రీం కోర్టు ఇటువంటి జాప్యాల మీద ఆందోళన వ్యక్తం చేసింది. bhullar

భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 72, 161 ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్ లకు చేసే అభ్యర్ధనను మనం క్షమాభిక్ష గా పిలుస్తున్నాం. అటువంటి ఖైదీలకు రాజ్యాంగం అప్పీల్ చేసుకునే హక్కుని, వాటిని పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకోవలసిన బాధ్యతను రాష్ట్రపతి, గవర్నర్ లకు అంటే ఆయా ప్రభుత్వాతలకు రాజ్యాంగం కట్టబెట్టింది. కానీ మనదేశంలో ఈ పని త్వరగా మానవత్వ దృష్ట్యా జరగలేదు. దీనివలన మరణం కోసం క్యూలో నిలబడినట్టుగా ఉన్నవారిలో కలిగే మనోవేదనను ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం అమానుషం.

ఈ రోజు జస్టిస్ జి ఎస్ సింఘ్వి, జస్టిస్ ఎస్ జె ముఖ్యోపాధ్యాయల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిర్ణయం తీసుకోకుండా పక్కకుపెట్టి ఉన్న క్షమాభిక్ష అభ్యర్థనలను మూడు రోజులలో కేంద్ర ప్రభుత్వాన్నికి పంపించాలని, అప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకి సమర్పిస్తుందని, అలా పంపించని పక్షంలో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసివస్తుందని హెచ్చరించారు. కొన్ని కేసుల్లో 11 సంవత్సరాలైనా ఏ నిర్ణయం తీసుకోకుండా పక్కకు పెట్టిన సందర్భాలున్నాయని, క్షమాభిక్షకు అభ్యర్థన వచ్చిన దగ్గర్నుంచీ ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తోంది.

మాటిమాటికీ పిటిషన్లను పంపిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం ఆ ఖైదీల మీద ఆరోపణ చెయ్యగా, పిటిషన్లను పంపించటానికి ఆంక్షలేమీ లేవంటూ ధర్మాసనం తెలియజేసింది.

వాళ్ళు చేసింది అమానుష చర్యే కానీ ప్రభుత్వం ఎక్కడ మానుషంగా ప్రవర్తిస్తోంది? 2001 లో పార్లమెంటు మీద దాడికి పాల్పడ్డ అఫ్జల్ గురు అతని అభ్యర్థనను 2005 లో సుప్రీం కోర్టు తోసిపుచ్చటంతో దాదాపూ ఐదు సంవత్సరాలు మరణ భయంలో గడిపాడు. అతని కుటుంబ సభ్యులు రాష్ట్రపతి క్షమాభిక్షకు అభ్యర్థనను పంపించటంతో, అక్టోబర్ 20, 2006 లో అమలు చెయ్యవలసిన మరణ శిక్ష ఇప్పటి వరకూ నిలిచిపోయివుంది. ఈ కాలంమంతా అతను ఏకాంతంగా జైల్లో మగ్గుతూ తనకి మరణ శిక్ష పడుతుందో పడదో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని కుటుంబ సభ్యుస ఆందోళనను పక్కకు పెడితే, అఫ్జల్ గురు మనోవేదన తక్కువదేమీ కాదు.

2009 సెప్టెంబరు 30 న హోం మంత్రి చిదంబరం తన దగ్గర అఫ్జల్ గురు తో పాటు 28 క్షమాభిక్ష కేసులు రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ప్రతిదాన్నీ మరోసారి జాగ్రత్తగా పరిశీలిస్తానని, ఒక్కో కేసుకీ దాదాపూ 3 నుంచి 4 వారాల కాలం పట్టవచ్చని అన్నారు. 1988 నుంచి పెండింగ్ లో ఉన్న కేసు తమిళనాడుకి చెందినది. అప్జల్ గురు కేసులో నిర్నయానికి రెండు సంవత్సరాలు పట్టవచ్చని చిదంబరం అన్నారు.   కానీ ముంబై దాడుల్లో పట్టుబడ్డ ఏకైక నేరస్తుడు కసబ్ కేసు కూడా రావటంతో అఫ్జల్ గురు అభ్యర్థనను మిగతావాటిని తప్పించి ముందుగా రాష్ట్రపతికి పంపించటం జరిగింది.

మరణశిక్షను అమలుపరచటంలో అమితమైన జాప్యం తర్వాత దాన్ని అమలుపరచటమనేది సభ్య సమాజంలోని కోర్టుల దృష్టిలో అమానుష చర్యగా భావించబడుతోంది. మానసిక, శారీరక ఒత్తిడితో పాటు ఎవరితోనూ కలవకుండా ఏకాంత ఖైదు లో మృత్యువు కోసం ఎదురు చూడటం తక్కువ శిక్షేమీ కాదు. ఆలస్యమవుతున్నకొద్దీ, ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ, అనిశ్చితిలో కాలం గడపటం వలన అతనికి, అతని కుటుంబ సభ్యలు మానసం మీద, శారీరక ఆరోగ్యం మీద దాని ప్రభావం పడటాన్ని సభ్య సమాజం అనుమతించగూడదు.

afjal-guru

అప్జల్ గురు విషయంలో మానవత్వం విషయం పక్కకు పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి కూడా పాలక ప్రతిపక్షనేతలు వెనకాడలేదు. ఎన్నికల ముందు అఫ్జల్ గురు మరణశిక్షను అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడితే, ఆ నాలుగు సంవత్సరాల్లోనూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫైలుని తన దగ్గరకు పంపించలేదనే కుంటిసాకుని చూపిస్తూ హోం మంత్రి తప్పించుకుందామని చూస్తే, మాజీ హోం మంత్రి ఆ ఫైలు ముందుకు కదలకుండా చేసారని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది.

అప్జల్ గురు మాట్లాడిన ఈ మాటలను బట్టి అటువంటి ఖైదీల మనోస్థితి ఎలా ఉంటుందన్నది తెలుసుకోవచ్చు- "వచ్చే ఎన్నికల్లో బిజెపి రావాలని కోరుకుంటున్నా. దానితో కనీసం నాకు మరణ శిక్ష ఖాయమై ఈ సందిగ్ధతకి తెరపడుతుంది. రెండు నాలికల కాంగ్రెస్ వైఖరి వలన ఎటూ తేలటం లేదు."

యు.ఎస్ సుప్రీం కోర్టు చెప్పినట్టుగా, "మరణ శిక్ష కంటే దాన్ని అమలు పరచటంలో నిందితుడికి కలుగుజేసే బాధకంటే దాని జాప్యంలో కలిగించే వేదన చాలా ఎక్కువ." దీన్ని ఉటంకిస్తూ, 2009 లో సుప్రీం కోర్టు, క్షమాభిక్ష పిటిషన్ ల మీద దీర్ఘమైన జాప్యం వలన ఆయా ఖైదీలను చిత్ర హింసకు గురిచేయటమౌతుందని పేర్కొంది.

1983 లో షేర్ సింగ్ కేసులో, భారత రాజ్యాంగంలోని అర్టికిల్ 72, 161 ప్రకారం, భారతీయ శిక్షస్మృతి సెక్షన్ 432, 433 కింద నేరస్తుల విషయంలో నిర్ణయాన్ని త్వరితగతిని తీసుకోవలసి వుందని, ప్రతి పిటిషన్ మీదా మూడు నెలల లోపులో నిర్ణయం తీసుకుంటామని సంబంధిత అధికారులు ఎవరికివారు సొంత నిబంధనను విధించుకోవలసి వుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.  కానీ ప్రభుత్వాలు దాన్ని విస్మరించాయని పెండింగ్ లో ఉన్న కేసులను చూస్తే తెలుస్తోంది.

mecineries

క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రభుత్వ విధానాల మీద సుప్రీం కోర్టు ఈ విధంగా స్పందించింది-

న్యాయమూర్తులుగా వ్యవహరించే మాకు, ఒక ఖైదీ మీద అతని పక్షాన కానీ వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణాయానికి కారణమేమిటో తెలియదు కానీ, కేసుని బట్టి న్యాయబద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అయితే మనుషులను రాజకీయ చదరంగంలో పావులుగా ఉపయోగించుకోగూడదని మాత్రం తెలియజేస్తున్నాం.

అటువంటి కేసుల్లో వారికి వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, తోబుట్టువులు సందిగ్ధావస్తలో వారి జీవనాన్ని మామూలుగా గడపలేరు. వాళ్ళ తప్పేమిటి. వాళ్ళని అటువంటి స్థితికి తీసుకెళ్ళటం అవసరమా.

దశాబ్దం కింద మరణశిక్ష విధించినవారి 28 క్షమాభిక్ష కేసులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయని తెలిసింది. ఈ సందర్భంగా, ఆ యా సంబంధిత ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్వచించిన విధులను పూర్తి చెయ్యాల్సిన అవసరముందని వారికి మేము గుర్తుచేస్తున్నాం.

నిజానికి ఆ నేరస్తుల శిక్ష మీద నిర్ణయం తీసుకోవటంలో జాప్యమంటే వాళ్ళని ప్రతిరోజూ ఉరితీస్తున్నదానితోనే సమానం. అయితే నేరస్తుల గురించి ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ చేతిలో బలై బాధ అనుభవించిన వాళ్ళ మాటేమిటని కొందరు అడుగుతారు. అందుకే వాళ్ళని నేరస్తులన్నాం. వాళ్ళకే గనక మానవత్వం ఎదుటివాళ్ళ బాధను అర్ధం చేసుకునే గుణమే ఉంటే వాళ్ళు నేరస్తులెందుకవుతారు, శిక్షనెందుకు అనుభవిస్తారు. ప్రభుత్వం కూడా నేరస్తుల కోణంలో ఆలోచించగూడదు కదా. ప్రభుత్వం కానీ కోర్టులు కానీ శిక్షాస్మృతులు, రాజ్యాంగంలోని నియమాల ప్రకారం శిక్షలను అమలు చెయ్యాలి కానీ, వాళ్ళు చేసిన దానికి తగిన శాస్తి జరుగుతోంది అనే భావనలోల పనిచెయ్యకూడదు కదా!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mubai congress leader to be prosecuted
Shri kirit somaiya on nrhm scam of chidambaram family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles