Shri kirit somaiya on nrhm scam of chidambaram family

Shri Kirit Somaiya on NRHM Scam of Chidambaram Family, Congress-UPA Government,Karthi Chidambaram, son of P Chidambaram,Ravi Krishna, son of Vayalar Ravi,Sweta Mangal, Bogus Benami Transactions-Scam

Shri Kirit Somaiya on NRHM Scam of Chidambaram Family

Scam.gif

Posted: 02/22/2012 04:35 PM IST
Shri kirit somaiya on nrhm scam of chidambaram family

Shri Kirit Somaiya on NRHM Scam of Chidambaram Family

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరో కుంభకోణంలో చిక్కుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు చిదంబరం, వయలార్ రవిల కుమారులు రాజస్థాన్‌లో ‘108 అంబులెన్స్ సర్వీసుల’ కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం పథకం కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 108 అంబులెన్స్ సర్వీసు పథకంలో తప్పుడు బిల్లులు సృష్టించి భారీ మొత్తంలో నిధులు కాజేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి, స్కామ్ ఎక్స్‌పోజ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరీట్ సోమయ్య పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేంద్ర హోంమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి కుమారుడు రవి కృష్ణలు డెరైక్టర్లు/వాటాదారులుగా ఉన్న జికిట్జా అనే సంస్థకు రాజస్థాన్‌లోని 108 అంబులెన్స్ సర్వీసుల కాంట్రాక్టును కట్టబెట్టారు.

ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు వాటాదార్లుగా ఉన్న ఈ సంస్థకు కాంట్రాక్టును ఆమోదించటంలో కూడా ఎలాంటి పారదర్శకతా లేదు. ఈ సంస్థ ఎప్పటికప్పుడు తప్పుడు బిల్లులు సమర్పించి.. అక్రమంగా ప్రభుత్వ సొమ్ము కాజేసింది. అసలు లేని వాహనాలకు, రోడ్డెక్కని వాహనాలకు కూడా బిల్లులు పెట్టింది. డబుల్ బిల్లింగ్‌కు (ఒక పనికి రెండు సార్లు బిల్లులు పెట్టటం) కూడా పాల్పడింది. 2011 సెప్టెంబర్‌లో వాస్తవంగా 37,458 ట్రిప్పులు వేస్తే.. 55,326 ట్రిప్పులు వేసినట్లు ప్రభుత్వానికి బిల్లులు సమర్పించింది’’ అని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన బోగస్ ఫోన్ కాల్స్, బోగస్ ట్రిప్పుల జాబితాను కూడా ఆయన మీడియాకు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Waiting for capital punishment is every day torture
Border backs pontings decision to play in tests  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles