నిన్న ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అయితే హై బడ్జెట్ మంత్రివర్యులకు లో బిపి వచ్చి అస్వస్థకు లోనయ్యారు. ఆయన బడ్జెట్ ని చదవటం మధ్యలో నిలిపివేయటంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు పొన్నాల లక్ష్మయ్య దాన్ని కొనసాగించారు. నిద్రలేమి, శరీరంలో చక్కెర స్థాయి పడిపోవటంతో చెమటలు పట్టి ఆనం తన సీట్లో కూర్చుండి పోయారు. వెంటనే లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆనం చెయ్యి పట్టుకుని నాడీనిదానాన్ని పరీక్షించారు. ఆయన తన పరిశీలనను ముఖ్యమంత్రికి చెప్పగా మంత్రి గీతారెడ్డి కూడా వచ్చి ఆనం ను పరీక్షించారు. డాక్టర్లు వైద్యపరీక్షల రాబోతుండగా తేరుకున్న ఆనం తిరిగి బడ్జెట్ పఠనాన్ని కొనసాగించారు.
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద సహజరీతిలోనే ప్రతిపక్షాలు పెదవి విరిస్తే ముఖ్యమంత్రి పోగడ్తలతో ముంచెత్తారు. బడ్జెట్ మీద శాసనసభ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, విద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఇంకా బడ్జెట్ లో ప్రస్తావించని ఈ విషయాల గురించి జెపి మాట్లాడారు. ఒకటి, స్థానిక ప్రభుత్వాలకు నిదులు, వారి అధికారాల ప్రస్తావన లేదు, రెండు విద్యుత్ వ్యవసాయ రంగాల్లో మౌలిక మార్పుల గురించి చెప్పలేదు. మూడు పన్నుల భారం చూపించలేదు.
కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మాత్రం ఆనం ప్రవేశపెట్టిన బడ్జెట్ నభూతో నభవిష్యతి అని కొనియాడారు. బడ్జెట్ అంకెలను చూస్త్ దాన్ని తయారు చేసిన ఆర్థిక మంత్రికే కళ్ళు తిరిగాయని వైయస్ ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులైన శోభానాగిరెడ్డి అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more