Best cheapest place

mumbai-delhi-1.gif

Posted: 02/17/2012 08:36 PM IST
Best cheapest place

      ప్రపంచస్థాయిలో చౌక నగరాల్లో మన దేశంలోని ముంబై రెండవ స్థానాన్ని, ఢిల్లీ నాల్గవ స్థానాన్ని ఆక్రమించాయి.  బీదల ఆకలి చావులు, పెరుగుతున్న ధరలకు బెంబేలెత్తుతున్న మధ్య తరగతి కుటుంబాలకు ఈ విషయం ఎంత మాత్రం ఊరటనివ్వకపోవచ్చు కానీ ప్రపంచంలోని నగరాల్లో చూసుకుంటే మనదేశంలోనే రెండు నగరాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. మరి మొదటి స్థానం, మధ్యలోని మూడవ స్థానం ఎవరికి దక్కిందీ అంటే, పాకిస్తాన్ లోని కరాచీ మొదటి స్థానాన్ని, ఇరాన్ రాజధాని టెహ్రాన్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి.  లభించే ఆహార పదార్థాల, ఇతర సేవల ఖరీదుని పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే వచ్చిన ఫలితమది. 

       సరే మరి అటునుంచి చూస్తే అత్యంత ఖరీదైన నగరం స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ నగరం.  ఆ తర్వాత నే వస్తాయి టోక్యో, జెనీవా, పారిస్, సిడ్నీ, మెల్బోర్న్, సింగపూర్, ఫ్రాంక్ఫర్ట్ నగరాలు. 

      ఢిల్లీ వాసులు ఈ లెక్కన అదృష్టవంతులే.  ఎందుకంటే, ఒకపక్క ఖరీదులో చూసుకుంటే కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది, ఆదాయంలో చూసుకుంటే దేశంలో అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం నమోదైంది.  ఢిల్లీవాసి తలసరి వార్షికాదాయం 116886 రూపాయలు అంటే నెలకి 9500.  తలసరి వ్యయం కేవలం 2905 రూపాయలు మాత్రమే.  అందులో 36 శాతం ఆహార పానీయాలకే ఖర్చు చేస్తున్నారట.  ఇవి 2009-10 సంవత్సరానికి ప్రభుత్వం లెక్కవేసి చెప్పిన అంకెలు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bedgif
Hyderabad airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles