Hyderabad airport

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

hyderabad-airport-1.gif

Posted: 02/17/2012 08:33 PM IST
Hyderabad airport

hyd-airport      ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ విమానాశ్రయాల్లో హైద్రాబాద్ 3 వ స్థానాన్ని ఆక్రమించిందంటే రాష్ట్ర ప్రజల హృదయం ఉప్పొంగటం సహజం.  ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసిఐ) ప్రకటించటం ఇంకా ఆనందదాయకం.  ఏసిఐ  179 దేశాల్లోని 1650 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న 580 సంస్థలకు ప్రాతినిధ్యం ఉంది.  అన్నిటిలో 3 వ స్థానాన్ని పొందటం హైద్రాబాద్ కి గర్వకారణమే.   ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎమ్ ఆర్ సంస్థకీ ఆ ఘనత దక్కుతుంది.  అబుదాబి, అడిలైడ్, జెనీవా, కేప్ టౌన్, హంబర్గ్, లండన్ లోని లూటన్ లాంటి విమానాశ్రయాలను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని సంపాదించింది.  విమాన ప్రయాణీకులకు ఉన్నతమైన సేవలనందించే నిర్వాహక సంస్థలకీ గుర్తింపు లభిస్తుందని జిఎమ్ఆర్ సంస్థ తెలియజేసింది. 

      అయితే ఆగండి, సంబరం ఎంత చేసుకోవాలో అంతే కదా.  క్రీడల్లో ఏ ఏజ్ గ్రూప్ కి దానికి విడివిడిగా పోటీలు పెట్టినట్టు, 50 లక్షల నుంచి కోటి మంది విమాన ప్రయాణీకులు ఉపయోగించుకునే విమానాశ్రయాల వర్గంలో ప్రపంచస్థాయిలో 3 వ స్థానం అన్నది కూడా గుర్తుంచుకోవాలి. 

      అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అత్యధిక విమాన ప్రయాణీకుల రద్దీ కలిగివున్నదిగానూ, లండన్ లోని హిత్రో విమానాశ్రయం సాలీనా అత్యధిక అంతర్జాతీయ విమాన ప్రయాణీకులను కలిగివున్నదిగానూ, జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం అత్యధిక విమానాశ్రయాలకు వెళ్ళే సేవలందించేదిగానూ, హాంగ్ కాంగ్ విమానాశ్రయం అత్యధిక కార్గో ని రవాణా చేసేదిగానూ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలిగివున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Best cheapest place
Ap budget outlay for 2012 13 up 14  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles