Bedgif

BEd students protest against TET,BEd students, Hyderabad, Telugu Yuvatha, YSR yuvatha, Students Parties, MLC Leader k. Nageswarao, Jobs

BEd students protest against TET

BEd.gif

Posted: 02/18/2012 10:01 AM IST
Bedgif

నిరసన తెలిపితే నలిపేస్తాం అనే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఎస్జీటీ పోస్టులకు బిఇడి అభ్యుర్థులకు కూడా అవకాశం కల్పించాలని, టెట్‌ను రద్దు చేయాలని, ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహించిన చలో అసెంబ్లీపై పోలీసులు దాడి చేసి తమ ప్రతాపం చూపడమే దీనికి నిదర్శనం. డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌, తెలుగు యువత, వైఎస్సార్‌ యువత, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, పివైఎల్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎఐడిఎస్‌ఒ రాష్ట్ర కమిటీలు చలో హైదరాబాద్‌కు నేతృత్వం వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌ హాజరయ్యారు. గత అనేక సంవత్సరాలుగా ఎస్జీటీ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశంఉండేదని, ఇప్పుడు ఎన్‌సిటిఇ నామ్స్‌ పేరుతో బిఇడీలకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేకుండా చేయడం గుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు ఏడు లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బిఇడి పూర్తిచేసిన అభ్యర్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. బిఇడి అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం కల్పించాలని విద్యార్థి, యువజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. నిరుద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి టెట్‌ను రద్దు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women demanding mobile phones but not toilets
Best cheapest place  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles