Ap budget outlay for 2012 13 up 14

India,Andhra Pradesh,economy, business and finance,economy (general),Andhra Pradesh Budget, India,Andhra Pradesh,politics,budget and tax (politics),AP Budget, Plan, non-Plan expenditure, revenue surplus, fiscal deficit

The Andhra Pradesh Budget for 2012-13 was up 14 per cent at Rs 1,45,854 crore with non-Plan allocation at Rs 91,824 crore, reflecting an increase of 13.89 per cent and Plan outlay at Rs 54,030 crore, up 13.61 per cent over the current financial year.

AP Budget outlay for 2012-13.GIF

Posted: 02/17/2012 06:08 PM IST
Ap budget outlay for 2012 13 up 14

AP-Budget-2012-13

ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్‑ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ప్రణాళికేతర వ్యయం : రూ.91,824 కోట్లు
ప్రణాళిక వ్యయం : రూ. 54,030 కోట్లు

వివిధ రంగాలకు కేటాయించన బడ్జెట్ అంకెల్లొ......

  • వ్యవసాయం , సాగునీరు రంగాలకు దండిగా నిధులు
  • ఉపాధి కల్పనా, ప్రభుత్వ పధకాల పై పత్యేక దృష్టి
  • అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన ఆనం
  • ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలత : ఆనం
  • కరువు తీవ్ర ప్రభావం చూపింది : ఆనం
  • 2011-12 లో స్థూల ఉత్పత్తి 4,07,949 కోట్ల రూపాయలు
    2005-11 లో రాష్ట్ర వృద్ధి 9.26 శాతం
  • 2011 నవంబరు నుండి బియ్యం ధరను ఒక్క రూపాయికి తగ్గించాం
    పన్నుల వసూళ్ళ లో లొసుగులు తొలగించటం ద్వారా ఆదాయం పెరిగింది.
  • రైతులకు, స్వయం సహాయక బృందాలకు 1075 కోట్ల వడ్డీ లేని రుణాలు
  • సకాలంలో చెల్లించే ఒక్కో రైతుకు లక్ష రూపాయల వడ్డీ లేని ఋణం
  • 2012 జనవరి వరకు పన్నుల ఆదాయంలో పెరుగుదల 19.5 శాతం
  • 2014 నాటికి లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పం
  • రాజీవ్ యువ కిరణాలకు 777 కోట్ల రూపాయల కేటాయింపు
  • 100 కోట్ల తో స్త్రీనిధి పధకం
  • ఇందిరా జలప్రభ కింద 10 లక్షల ఎకరాల సాగు నీరు కోసం లక్ష బోర్లు
  • ఇందిరా జలప్రభ కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చు
  • 2012-13 సంవత్సరానికి 1,45,854 కోట్ల బడ్జెట్
  • సాగునీటి రంగానికి 15 వేల 10 కోట్లు
  • 560 కోట్ల రూపాలయ విపత్తు నిధి
  • పంచాయితీ రాజ్ కు 200 కోట్లు
  • గ్రామీణ నీటి సరఫరాకు 300 కోట్లు
  • ఐటీ కి 150 కోట్లు
  • రోడ్లు భవానాలు 5032 కోట్లు
  • విద్యుత్ కు 5937 కోట్లు
  • మహిళా సంక్షేమానికి 2283 కోట్లు
  • సాంఘిక సంక్షేమానికి 2677 కోట్లు
  • గిరిజన సంక్షేమానికి 2283 కోట్లు
  • వ్యవసాయ రంగానికి 3175 కోట్లు
  • పట్టణాభివృద్ధి శాఖకు 6586 కోట్లు
  • సాంకేతిక విద్యకు 1087 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి 487 కోట్లు
  • ఆరోగ్య శాఖకు 5040 కోట్లు
  • కార్మిక శాఖకు 500 కోట్లు
  • శాంతి భద్రతలకు 4832 కోట్లు
  • కరువు సాయం కింద 3500 కోట్లు
  • ప్రణాళిక వ్యయం 54,043 కోట్లు
  • ప్రణాలికేతర వ్యయం 91,824 కోట్లు
  • ద్రవ్యలోటు 20, 080 కోట్లు
  • బీసి సంక్షేమానికి 3014 కోట్లు
  • వికలాంగుల సంక్షేమానికి 88 కోట్లు
  • పాల ఉత్పత్తికి రాజీవ్ పాల మిషన్ కింద ప్రత్యెక ప్రోత్సాహకాలు
  • మత్సకారుల సంక్షేమానికి 234 కోట్లు
  • పట్టు పరిశ్రమ అభివృద్ధికి 188 కోట్ల రూపాయలు
  • స్వయం సహాయక బృందాల రుణాలకు 1000 కోట్లు
  • సాధారణ పరిపాలన శాఖకు 88 కోట్లు
  • చిన్ననీటి పారుదల శాఖకు 300 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి పధకాలకు 4703 కోట్లు
  • పశు సంవర్ధక శాఖకు 1106 కోట్లు
  • పౌర సరఫరాల శాఖ 4135 కోట్లు
  • కార్మిక శాఖ 500 కోట్లు
  • 2011-12 పారిశ్రామిక వృద్ధి రేటు 7.33 శాతం
  • క్రీడలకు 220 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖకు 2302 కోట్లు
  • 159 కోట్ల చేనేత రుణాలు రద్దు
  • 12, వేల 132 కోట్ల రూపాయల అంచానాతో మెట్రో రైలు పనులు
    హైదరాబాదుకు గోదావారి జలాల తరలింపునకు సర్కారు కృషి చేస్తుంది
  • ఇందిరా క్రాంతి పధకం కోసం 6586 కోట్ల రూపాయలు
  • పౌర సరఫరాల శాఖకు 3175 కోట్లు
  • ఆర్టీసీ కి 6 వేల కొత్త బస్సులు
  • అటవీ పర్యావరణ శాఖకు 524 కోట్లు
  • గ్రామీణ, నగర స్థానిక సంస్థల వికేంద్రీకరణకు 657 కోట్లు
  • పాల మిషన్ కి 100 కోట్లు
  • ఆర్టీసీ కి 5032 కోట్లు
  • పాటశాల విద్యకు 15510 కోట్లు
  • ఉన్నత విద్యకు 1841 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి 5889 కోట్లు

బడ్టెట్ కేటాయింపులపై వివిధ పార్టీల నాయకులు పెదవి విరిసారు. రాష్ట్ర బడ్జెట్‌పై విపక్షనేత చంద్రబాబు కేటాయింపులన్నీ ఆశ్చర్యం కలిగించాయన్నారు. జలయజ్ఞం గుది బండగా మారిందన్న బాబు... వివిధ రంగాలకు కేటాయించే నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. సమాన్యులపై పన్నుభారం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. అవినీతి, పన్నుల భారంతో ప్రభుత్వం పేదవాళ్ల రక్తం తాగుతోందని మండిపడ్డారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాల కేటాయింపుల కన్నా, మన రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం మీద నిధుల కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని జేపీ విమర్శించారు. నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నామని కాగితాల మీద అంకెలు మాత్రమే చూపిస్తున్నారని, వాస్తవానికి నిధుల కేటాయింపు సక్రమంగా జరగడం లేదని జేపీ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad airport
President son caught in  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles