Sex offenders in school what are the rules

Sex offenders in school What are the rules, public schools offering single, sex classrooms rose from ,Guidelines,courses offered by sex,

Sex offenders in school What are the rules

offenders.GIF

Posted: 12/05/2011 04:47 PM IST
Sex offenders in school what are the rules

Sex offenders in school: What are the rules

సమాజం ఏమనుకుంటే మాకేంటి శృంగారంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అలా తెలుసుకోవడం వల్ల నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ప్రేమ స్థానంలో... ఆత్మీయతతో కూడిన ప్రేమ పుడుతుంది. అలాంటి ప్రేమ కోసం శిక్షణ ఇస్తామంటూ అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా సెక్స్ స్కూల్‌నే ప్రారంభించింది ఒకావిడ. వాత్సాయనుడు కామసూత్రాలు మాత్రమే చెప్పాడు. కాని ఈవిడ థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా అవసరం అంటోంది. ఆమె పేరు వా-మరియా థాంప్సన్.

Sex offenders in school What are the rules

"శరీర ఫిట్‌నెస్ కోసం, బుర్ర బాగా పనిచేయడం కోసం, కండరాలు పటిష్టంగా ఉంచుకోవడం కోసం జిమ్‌లకు, బాడీ-మైండ్ ఫిట్‌నెస్ కేంద్రాలకు వెళ్తారు. సమయాన్ని, డబ్బును ఖర్చు పెడతారు. కాని జీవితంలో ఎంతో ముఖ్యమైన, మధురమైన ప్రేమబంధాన్ని పెంచుకునే మార్గాలను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు?'' - అంటారు థాంప్సన్. ఈ భూమ్మీద మొట్టమొదటి శృంగార పాఠశాల ప్రారంభించిన ఘనత ఈమెదే. ఆమె స్కూల్ పేరు 'ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సెక్స్' (ఎఐఎస్ఒఎస్). వియన్నాలో, జనవరి 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించబోతున్నారు. ఇటీవల వార్తల్లో వచ్చిన ఈ పాఠశాల గురించిన వివరాలే ఇవి.

Sex offenders in school What are the rules

'నాలుగ్గోడల మధ్య అతి రహస్యంగా ఉండాల్సిన విషయాలను స్కూల్లో తరగతులు చెప్పి మరీ బోధిస్తారా! ఇదెక్కడి విడ్డూరం... అని బుగ్గలు నొక్కుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శృంగార సంబంధిత విషయాల్లో తెలుసుకోవాల్సిన అంశాలు విస్తారంగా ఉన్నాయి. అటువంటి శృంగార చరిత్రలోని బేసిక్స్‌ను తెలియజేసేందుకు ఈ స్కూల్ ప్రారంభించాం. ఇందులో మొత్తం ఐదు కోర్సులు ఉంటాయి. అన్నింటికీ థియరీ ఉంటుంది. కాకపోతే మా ఫోకస్ మాత్రం ప్రాక్టికల్ ఎక్సర్‌సైజ్‌ల మీదే. ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పడం వల్ల శృంగార జీవితంలో చాలా మార్పు చోటు చేసుకుంటుందని'' అంటున్నారు థాంప్సన్.

Sex offenders in school What are the rules

వీళ్లు తమ కరిక్యులమ్‌ను చాలా పక్కాగా రూపొందించుకున్నారు. మొత్తం ఐదు కోర్సులుగా దీన్ని తయారు చేశారు. కోర్సు ఎ 2011లో ఉండే అంశాలు జనవరి 9 న ప్రారంభమయ్యే కోర్సులో 'సెక్సువల్ టెక్నిక్స్' - 10 వారాలు, 'అడ్వాన్స్ ్డ ఇంటర్‌కోర్సు' - 8 వారాలు ఫిబ్రవరి 6 న ప్రారంభమయ్యే కోర్సులో 'సెక్సువల్ మసాజ్' (కప్పా) - 8 వారాలు ఫిబ్రవరి 27 న ప్రారంభమయ్యే కోర్సులో 'సెక్సువల్ టెక్నిక్స్ 2' - 8 వారాలు మార్చి 4 న ప్రారంభమయ్యే కోర్సులో Geschichte des'సెక్స్' - 4 వారాలు వీటన్నిట్లో కలిపి 200 పాఠాలు ఉంటాయి. శృంగార పాఠశాల ప్రవేశం కోసం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి.

ఒక్కో సెమిస్టర్‌కు 1,400 యూరోలు ఫీజుగా వసూలు చేస్తారు. అంటే దాదాపు 96,000 రూపాయలన్నమాట. ఫీజు ఎక్కువే అయినా జీవితంలో రొమాన్స్ నింపుకోవాలనుకునే వాళ్లకి అదో లెక్క కాదు. అందుకనే ఇప్పటికే అన్ని బ్యాచ్‌లు నిండిపోయాయి. ఐదుగురు టీచర్లు, 70 మంది విద్యార్థులతో కొత్త సంవత్సరంలో పాఠాలు మొదలవ్వబోతున్నాయి. ఫీజులు గట్రా విషయాలు పక్కనపెడితే గర్భనిరోధకాలను ఎటువంటి రుసుము లేకుండా ఇస్తారట ఇక్కడ.

Sex offenders in school What are the rules

వారాంతపు కోర్సులు కూడా ఉన్నాయి. వీటికోసం రెండు రాత్రుళ్లు స్కూల్ క్యాంపస్‌లో ఉండాలి. డబుల్‌రూమ్‌లో వసతి ఉంటుంది. రెండు పూటలా భోజనం పెట్టి, స్కూల్లో అల్పాహారం అందిస్తారు.దీనికి రెండు వందల యూరోలు అంటే 13,698 రూపాయలు ఫీజు చెల్లించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leaves without pay
Mim declares its opininon in the assembly on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles