New love letter

New Love letter, Lovers, Love, Congress Party, Chiranjeevi, Prp Party, Kadapa, Andrapradesh, Sriramarajyam,

New Love letter

New Love.GIF

Posted: 11/19/2011 05:48 PM IST
New love letter

loversపసిపాప ఎంగిలిలా... పండుగ పూట పొంగలిలా..
పల్లేటూరి వాకిలలా... పండు వెన్నెల జాబిలాలా..
నువ్ ఎంతందంగా ఉంటో తెలుసా!

ప్రతి ఊరి చివర ఓ బస్టాండ్ లా ..
ప్రతి వీధి చివర ఓ స్ట్రీట్ లైటా లా ...

నీ బతుకు చివర శీతాకాలం జలుబులా..
చీకటిలో బల్బులా...
నీ తోడుగా ఉంటా.

నీవ్వుతినే చెరుకు గడ నుంచి పడుకునే తలగడ వరకు,
నువ్వు వేసుకునే వాలుజడ నుంచి తాగే పాలమీగడ వరకు,
నేనే ఐతే ఎంత బావుంటుందో అనిపిస్తుంది.

మన మధ్య దూరం ఏడు అడుగులు కావాలని,
మన మధ్య బంధం మూడు ముళ్లు కావాలని,
మన ఊరి మద్ది ఆంజనేయ స్వామికి మొక్కుకున్నా.

కాంగ్రెస్ కడపలో ఓట్లు ...
కటిక పేదవాడి చేతికి కరెన్సీ నోట్లు ...
వస్తాయోమోగానీ నువ్వు మాత్రం రావు కదా...

ఆంద్రప్రదేశ్ లో సీఎంలు మారినట్టు ,
ఎప్పటికైనా నీ మనసు మారుతుందని,
వెయిట్ చేస్తున్నా.

ప్రజారాజ్యంలా నీ ప్రేమని నాలో విలీనం చేస్తే నా జీవితం శ్రీరామరాజ్యం. 
అగ్నికి ఆజ్యం పోసి నన్ను ఆహుతి చేస్తావో,
నీ ప్రేమరాజ్యానికి రాజును చేసి ,
నా శ్రీమతి అవుతావో నీ ఇష్టం.

 


ఇట్లు
ప్రేమికుడు



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer y srilakshmi questioned in obulapuram mining case
Telecom minister sukhram sentenced to 5 years imprisonment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles